The Family Man 3: అడవిలో శవమై కనిపించిన ఫ్యామిలీ మ్యాన్ నటుడు.. అసలు ఏం జరిగిందంటే?

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ఫ్యామిలీ మ్యాన్ 3' నటుడు రోహిత్ మృతదేహం అస్సాం అడవుల్లో లభ్యమైంది. ఆదివారం సాయంత్రం అస్సాంలోని ఓ జలపాతం వద్ద అతని మృతదేహం కనిపించింది. దీంతో అతని మరణం వెనక గల మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు.

The Family Man 3: అడవిలో శవమై కనిపించిన ఫ్యామిలీ మ్యాన్ నటుడు.. అసలు ఏం జరిగిందంటే?
Rohit Basfore

Updated on: Apr 29, 2025 | 1:29 PM

‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3′ వెబ్ సిరీస్‌లో నటిస్తోన్న రోహిత్ బాస్ఫోర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అస్సాంలోని గర్భగం అడవిలోని ఒక జలపాతం దగ్గర అతని మృతదేహం లభ్యమైంది. నటుడి అనుమానాస్పద మరణం బాలీవుడ్ లో సంచలనంగా మారింది. రోహిత్ ప్రమాదవశాత్తు చనిపోయాడా? లేక హత్యనా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఫ్యామిలీమ్యాన్’ సీజన్ 3 షూటింగ్ జరుగుతుండగానే రోహిత్ హత్యకు గురవ్వడం అందరినీ కలచి వేస్తోంది. రోహిత్ ముంబైలోనే ఉండే వాడు. కొన్ని నెలల క్రితం, అతను తన స్వస్థలమైన గౌహతికి తిరిగి వచ్చాడు. ఆదివారం (ఏప్రిల్ 27) రోహిత్ స్నేహితులతో బయటకు వెళ్తున్నానని చెప్పాడు. అయితే, అతను సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. దీంతో ఎవరూ అతన్ని సంప్రదించలేకపోయారు. ఇది చాలా అనుమానాలకు తావిచ్చింది. ఆ తర్వాత, స్నేహితులు ఫోన్ చేసి ప్రమాదం గురించి తెలియజేశారు. ఆ తర్వాతే రోహిత్ చనిపోయాడని ప్రకటించారు.

ఇప్పుడు రోహిత్ కుటుంబం తమ కొడుకు హత్యకు గురయ్యారని ఆరోపిస్తోంది. ఇటీవల, పార్కింగ్ సమస్యపై రంజిత్, అశోక్, ధరమ్‌లతో గొడవ జరిగిందని, వారు రోహిత్‌ను చంపేస్తానని బెదిరించారంటుననారు. అలాగే, రోహిత్ బంధువు అమర్‌దీప్ కు కూడా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు చెబుతున్నారు. ఆయనే ఈ యాత్రను ప్లాన్ చేశారని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే రోహిత్ శరీరంపై చాలా గాయాలు ఉన్నాయి. కాబట్టి, ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘నటుడి పోస్ట్‌మార్టం ఇప్పటికే పూర్తయింది.’ అతని శరీరంపై చాలా దెబ్బలు ఉన్నాయి. ముఖం, తలపై తీవ్ర గాయాలు అయ్యాయి. ‘మేం కేసును దర్యాప్తు చేస్తున్నాం’ అని పోలీసులు తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.