Sachin Joshi Arrest: ముచ్చటపడి రూ. 100 కోట్ల విలువజేసే విల్లాను కొనుగోలు చేశాడు. అడ్డంగా బుక్కై మనీ లాండరింగ్ కేసులో జైలు పాలయ్యాడు బాలీవుడ్ నటుడు, ప్రముఖ వ్యాపారవేత్త సచిన్ జోషి. ముంబైకి చెందిన ఓంకార్ రియల్టర్స్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సచిన్ జోషిని ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
ప్రముఖ బిజినెస్‌మెన్ విజయ్ మాల్యాకు చెందిన గోవా కింగ్‌ఫిషర్ విల్లాను 2017లో సచిన్ జోషి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఓంకార్ రియల్టర్స్, సచిన్ జోషి మధ్య జరిగిన లావాదేవీలలో అవకతవకలు జరిగాయని ఈడీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఓంకార్ గ్రూప్ ప్రమోటర్స్, సచిన్ జోషిలపై రూ. 100 కోట్లు కాజేశారని ఆరోపణలు సైతం ఉన్నాయి.
గతంలోనే ఈ అంశంపై ఈడీ అధికారులు జోషిని దర్యాప్తునకు పిలవగా.. జోషి హాజరుకాలేదు. దీనితో అతడిని ఆదివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అటు అరెస్ట్‌కు ముందు అధికారులు సచిన్ జోషిని 18 గంటల పాటు విచారించారని తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రెస్టారెంట్లు, క్లబ్‌లు నడుపుతోన్న ప్లేబాయ్ ఫ్రాంచైజీని సైతం జోషి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, 2020లో సచిన్ జోషిని గుట్కా కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.
‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..