Shah Rukh Khan: షారుఖ్ ఖాన్‏కు ఇష్టమైన రెండు పెర్ఫ్యూమ్స్ ఇవే.. ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు..

|

Apr 02, 2024 | 5:15 PM

ముంబైలోని బాంద్రా ప్రాంతంలో విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నాడు. ఈ కళ్లు చెదిరే ఇంటికి మన్నత్ అనే పేరు కూడా పెట్టారు. బీటౌన్ కింగ్ ఖాన్ ఆస్తి రూ. 6000 కోట్లకు పైమాటే. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సినీ సెలబ్రెటీస్ కూడా షారుఖ్‏కు అభిమానులు. ముఖ్యంగా షారుఖ్ ఉపయోగించే పెర్ఫ్యూమ్స్ అంటే బాలీవుడ్ హీరోయిన్స్‏కు చాలా ఇష్టం. అనుష్మ శర్మ, దీపికా పదుకొణె సహా పలువురు హీరోయిన్స్ షారుఖ్ వాడే పెర్ఫ్యూమ్స్ గురించి అనేకసార్లు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు.

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్‏కు ఇష్టమైన రెండు పెర్ఫ్యూమ్స్ ఇవే.. ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Shah Rukh Khan
Follow us on

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ గురించి చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోవర్స్‏ను కలిగిన ఉన్న హీరోలలో బాద్ షా ఒకరు. సూపర్ హిట్ చిత్రాలతోనే కాకుండా తన యాటిట్యూడ్.. స్టైలీ.. స్మైల్‏తో అభిమానులను కట్టిపడేస్తాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఇప్పుడు బీటౌన్‏ను శాసిస్తున్నాడు. ఇండస్ట్రీలో అత్యధిక సంపాదన కలిగిన హీరో షారుఖ్. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నాడు. ఈ కళ్లు చెదిరే ఇంటికి మన్నత్ అనే పేరు కూడా పెట్టారు. బీటౌన్ కింగ్ ఖాన్ ఆస్తి రూ. 6000 కోట్లకు పైమాటే. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సినీ సెలబ్రెటీస్ కూడా షారుఖ్‏కు అభిమానులు. ముఖ్యంగా షారుఖ్ ఉపయోగించే పెర్ఫ్యూమ్స్ అంటే బాలీవుడ్ హీరోయిన్స్‏కు చాలా ఇష్టం. అనుష్మ శర్మ, దీపికా పదుకొణె సహా పలువురు హీరోయిన్స్ షారుఖ్ వాడే పెర్ఫ్యూమ్స్ గురించి అనేకసార్లు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు. దీంతో ఇప్పుడు బాద్ షా పెర్ఫ్యూమ్స్ గురించి ఆరా తీస్తున్నారు నెటిజన్స్.

ఈ క్రమంలోనే తాజాగా GQ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ తనకు ఇష్టమైన పెర్ఫ్యూమ్‌ల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. “నాకు మంచి వాసన రావడం చాలా ముఖ్యం. నేను రెండు పెర్వ్యూమ్స్‏ను మిక్స్ చేసి ఉపయోగిస్తాను. అవి లండన్ స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. వాటి పేర్లు డన్‌హిల్, డిప్టీ క్యూ ఒకటి. ఈ రెండింటిని కలిపి ఉపయోగిస్తాను. వీటి సువాసన నాకు చాలా ఇష్టం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం షారుఖ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

షారుఖ్ చెప్పిన రెండు పెర్ఫ్యూమ్స్ మన దేశంలో ఖరీదులు ఇలా ఉన్నాయి. డన్‌హిల్ మెన్ పెర్ఫ్యూమ్‌ ధర రూ. 9000 నుంచి 10,000లకు పైగానే ఉన్నాయి. అలాగే డిప్టీ క్యూ పెర్ఫ్యూమ్ ధర రూ.33,000 నుంచి రూ. 39,000 వరకు ఉన్నాయి. షారుఖ్ ఖాన్ గతంలో కొన్ని పెర్ఫ్యూమ్ బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా పనిచేశాడు. 2023లో పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. అలాగే ఆ తర్వాత వచ్చిన డంకీ కూడా మంచి విజయం అందుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.