ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు అనురాగ్ కశ్యప్. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరైన అనురాగ్ .. సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ వల్ల దేశాన్ని వదిలి వెళ్లిపోయారట. అంతేకాదు.. తన కూతురికి వచ్చిన బెదిరింపులతో తాను ఒత్తిడికి గురయ్యాను అని.. దీంతో గుండెపోటు వచ్చిందంటూ సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తన మీద.. తన కుటుంబం మీద ద్వేషం చూపించారని.. తన కూతురుని రేపు చేస్తామని బెదిరించారని.. దీంతో సినిమాలు ఆపేసి తన కూతురు కోసం విదేశాలకు వెళ్లిపోయానని.. ఆ ట్రోలింగ్స్ వల్ల తాను మూడేళ్లు డిప్రెషన్లో ఉన్నానని.. అదే సమయంలో గుండెపోటు వచ్చిందని తెలిపారు.
” పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నా మీద.. నా కుటుంబం మీద ఎంతో ద్వేషం చూపించారు. నా కూతురిని ట్రోల్ చేశారు. తనను ఆత్యాచారం చేసి చంపేస్తామని బెదిరింపుల వల్ల ఆమె ఒత్తిడికి లోనయ్యింది. దీంతో నే ను ట్విట్టర్ ఉపయోగించడం మానేశాను. అందుకే 2019లో పోర్చుగల్ వెళ్లిపోయాను. ఆ తర్వాత ప్యార్ విత్ డిజే మొహబ్బత్ సినిమా షూటింగ్ ఉండడంతో భారత్ తిరిగి రావాల్సి వచ్చింది. తనపై వచ్చిన ట్రోలింగ్స్ వల్ల నా కూతురు ఎక్కువగా ఆందోళన చెందింది. దీంతో ఆమె చాలా డిస్టర్బ్ అయ్యింది. ప్రతి దానికి చా లా కంగారు పడిపోతుంది. ఆ విషయమే నన్ను ఎక్కువగా టెన్షన్ పెడుతుంది. దాదాపు మూడేళ్లు డిప్రెషన్ లో ఉన్నాను. గతేడాది గుండెపోటు వచ్చి ఆసుపత్రి పాలయ్యాను. కానీ కోలుకున్న తర్వాత సినిమాలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను ట్విట్టర్ మళ్లీ ఉపయోగిస్తున్నాను”.. అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం అనురాగ్ తెరకెక్కించిన దీదే మొహబ్బత్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో అలయ ఎప్, కరణ్ మెహతా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అనురాగ్ కశ్యప్ మరియు జీ స్టూడియోస్ నిర్మించాయి. వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.