Dadasaheb Phalke Awards: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022 వేడుక ఆదివారం(ఫిబ్రవరి 20న) ముంబై(Mumbai)లో ఘనంగా నిర్వహించారు. ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పలువురు తారలు స్టైలిష్ దుస్తుల్లో మెరిసి, ఆకట్టుకున్నారు. ప్రముఖ నటి ఆశా పరేఖ్, రవీనా టాండన్, లారా దత్తా, కియారా అద్వానీ తదితరులు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ వేడుకకు హాజరైన వారిలో అహన్ శెట్టి , సతీష్ కౌశిక్, రోహిత్ రాయ్, రణవీర్ సింగ్ తల్లి అంజు భవ్నానీ, ఆయుష్ శర్మ, రణ్‌విజయ్ సింఘా, షహీర్ షేక్ కూడా ఉన్నారు. 2021లో విడుదలై, విశేష ఆదరణ పొందిన సినిమాలు, నటులు అవార్డులు అందుకున్నారు. గత ఏడాది చివరిలో రిలీజైన అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్ప : ది రైజ్.. ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. షేర్షా ఉత్తమ చిత్రంగా రణవీర్ సింగ్ , కృతి సనన్ ఉత్తమ నటీనటులుగా నిలిచారు.
విజేతల లిస్ట్:
ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ – పుష్ప: ది రైజ్
ఉత్తమ చిత్రం – షేర్షా
ఉత్తమ నటుడు – రణవీర్ సింగ్(83)
ఉత్తమ నటి – కృతి సనన్(మిమీ)
ఉత్తమ దర్శకుడు – కెన్ ఘోష్(స్టేట్ ఆఫ్ సీజ్)
అత్యుత్తమ సహకారం – ఆశా పరేఖ్
ఉత్తమ సహాయ నటుడు: సతీష్ కౌశిక్ (కాగజ్)
ఉత్తమ సహాయ నటి: లారా దత్తా (బెల్ బాటమ్)
ఉత్తమ విలన్ – ఆయుష్ శర్మ (అంతిమ్: ది ఫైనల్ ట్రూత్)
క్రిటిక్స్ ఉత్తమ చిత్రం – సర్దార్ ఉదం
క్రిటిక్స్ ఉత్తమ నటుడు – సిద్ధార్థ్ మల్హోత్రా(షేర్షా)
క్రిటిక్స్ ఉత్తమ నటి – కియారా అద్వానీ(షేర్షా)
పీపుల్స్ ఛాయిస్ బెస్ట్ యాక్టర్ – అభిమన్యు దస్సాని
పీపుల్స్ ఛాయిస్ ఉత్తమ నటి – రాధిక మదన్
బెస్ట్ డెబ్యూ – అహాన్ శెట్టి (థడప్)
ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం – మరో రౌండ్
ఉత్తమ వెబ్ సిరీస్ – కాండీ
వెబ్ సిరీస్ ఉత్తమ నటుడు – మనోజ్ బాజ్‌పేయి(ది ఫ్యామిలీమ్యాన్)
వెబ్ సిరీస్ ఉత్తమ నటి – రవీనా టాండన్
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ – అనుపమ
టెలివిజన్ సిరీస్ ఉత్తమ నటుడు – షహీర్ షేక్
టెలివిజన్ సిరీస్ ఉత్తమ నటి – శ్రద్ధా ఆర్య
టెలివిజన్ సిరీస్ మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ – ధీరజ్ ధూపర్
టెలివిజన్ సిరీస్ అత్యంత ప్రామిసింగ్ నటి – రూపాలీ గంగూలీ
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ – పౌలి
ఉత్తమ నేపథ్య గాయకుడు – విశాల్ మిశ్రా
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ – కనికా కపూర్
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – జయకృష్ణ గుమ్మడి
Congratulations to ‘Pushpa: The Rise’ for winning the award for Film Of The Year at Dadasaheb Phalke International Film Festival Awards2022. Your hard work and perseverance have paid off. #dpiff #dpiff2022 #dpiffawards #dpiffdiaries #dpiffglimpse #dpifflegacy #dpiffawards2022 pic.twitter.com/XSIKCYa23T
— Dadasaheb Phalke International Film Festival (@Dpiff_official) February 20, 2022
Also Read: