బాలీవుడ్ సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, పార్టీల్లో తరచూ కనిపించే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి వివాదంలో ఇరుక్కున్నాడు. పవిత్ర వైష్ణోదేవి ఆలయంలో అమర్యాదకరంగా ప్రవర్తించినందుకు అతనితో పాటు మరో ఏడుగురిపై జమ్మూ కశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంచలనాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఓర్రీ ఇటీవలే తన ఏడుగురు స్నేహితులతో కలిసి జమ్ము కశ్మీర్‌లోని వైష్ణో దేవి మాతా ఆలయానికి వెళ్లాడు. అక్కడి ఓ హోటల్లో భోజనం చేసేందుకు దిగారు. అందరూ కలిసి కడుపు నిండా తిన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. అక్కడే తమ వెంట తెచ్చుకున్న ఓ మందు బాటిల్ విప్పి భోజనం చేస్తూ తాగేశారు. ఈ విషయం గుర్తించిన కొందరు స్థానికులు దాన్ని ఫొటోలు, వీడియోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు హోటల్ కు వెళ్లి మరీ దర్యాప్తు చేపట్టారు. స్థానికులు ఫిర్యాదు చేసినట్లుగానే ఓర్రీ అతని ఏడుగురు స్నేహితులు మద్యం సేవించినట్లు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత వారందరిపై కేసులు నమోదు చేశారు. ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి, శ్రీ దర్శన్ సింగ్, శ్రీ పార్థ్ రైనా, శ్రీ రితిక్ సింగ్, శ్రీమతి రాశి దత్తా, శ్రీమతి రక్షిత భోగల్, శ్రీ గుషన్ కోహ్లీ, శ్రీమతి అర్జమస్కినాలపై కేసులు పెట్టారు. ఈ విషయాన్ని జమ్మూ కశ్మీర్ పోలీసు అధికారులే మీడియాకు వెల్లడించారు.
దివ్య మాతా వైష్ణో దేవి తీర్థయాత్ర స్థలం కాబట్టి ఇక్కడ మాంసం, మద్యపాన నిషేధం ఉందని పోలీసులు తెలిపారు. అలాంటి పవిత్రమైన స్థలంలో ఓర్రీ తన స్నేహితులతో కలిసి చట్ట విరుద్ధంగా మద్యం సేవించారని.. అందుకే వారిపై కేసులు పెట్టామని పోలీసులు వివరించారు. మత పరమైన ప్రదేశాల్లో భక్తుల మనోభావాలు తెబ్బతీసేలా వ్యవహరిస్తే.. వారు ఎంత పెద్ద వారైనా సరే
కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మూ పోలీసులు హెచ్చరించారు. ఓర్రీ అండ్ గ్యాంగ్ ను గుర్తించి అరెస్ట్ చేయడానికి ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కాత్రా ఎస్పీ వెల్లడించారు.
#WATCH | Katra, J&K | On Orry booked with seven others for alleged alcohol consumption near Vaishno Devi in Katra, President Hotel Restaurant Association Katra, Rakesh Wazir says, “Drinking alcohol is prohibited in Katra and onion and garlic are not used in vegetables in hotels… pic.twitter.com/AIj9QK79o8
— ANI (@ANI) March 17, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి