Brahmastra : ఊపిరి పీల్చుకుంటున్న బాలీవుడ్.. బ్రహ్మాస్త్ర కలెక్షన్లతో నిర్మాతలకు మళ్లీ ఆశలు..

|

Sep 25, 2022 | 9:16 AM

ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్లు రాబటినట్లుగా తెలుస్తోంది. దాదాపు విడుదలై 14 రోజులలో కలెక్షన్స్ తగ్గినప్పటికీ ఈ వీకెండ్స్‏లో ఊపందుంకుంటుందని భావిస్తున్నారు మేకర్స్.

Brahmastra : ఊపిరి పీల్చుకుంటున్న బాలీవుడ్.. బ్రహ్మాస్త్ర కలెక్షన్లతో నిర్మాతలకు మళ్లీ ఆశలు..
Brahmastra
Follow us on

బాలీవుడ్ హ్యాండ్సమ్ రణబీర్ కపూర్, అలియా కపూర్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర (Brahmastra). డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఫాంటసీ అడ్వెంచర్ డ్రామాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారుఖ్ ఖాన్, మౌనీ రాయ్ కీలకపాత్రలలో నటించారు. బ్రహ్మాస్త్రం పార్ట్ 1 శివగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ముందు నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అంతేకాకుండా బాయ్‏కాట్ నినాదాల మధ్య ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్లు రాబటినట్లుగా తెలుస్తోంది. దాదాపు విడుదలై 14 రోజులలో కలెక్షన్స్ తగ్గినప్పటికీ ఈ వీకెండ్స్‏లో ఊపందుంకుంటుందని భావిస్తున్నారు మేకర్స్.

కేవలం హిందీలోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో విడుదలైన ఈ సినిమా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 75 కోట్లు వసూళు చేసింది. ఇక నెగిటివి మధ్య కూడా బ్రహ్మాస్త్రకు వసూళ్లు మాత్రం ఎక్కువగానే రాబట్టింది. ట్రేడ్ నివేదికల ప్రకారం బ్రహ్మాస్త్ర 14వ రోజున రూ. 3.10 కోట్లు రాబట్టింది. దీంతో మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ. 230.57 కోట్లకు చేరుకుంది. ఇక విడుదలై మూడు వారాలు ముగుస్తున్న థియేటర్లు మాత్రం 85 మాత్రం నిండుతున్నాయి. మరిన్ని రోజుల్లో ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టే అవకాశాలనున్నాయని అంటున్నారు.

సెప్టెంబర్ 9న విడుదలైన ఈ సినిమా గత కొంతకాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బాయ్ కాట్ సెగను తట్టుకొని మూడు వారాల్లోనే రూ. 400 కోట్లకు చేరవవడంతో ఇప్పుడు బీటౌన్ ప్రొడ్యూసర్స్‏కు మళ్లీ కొత్త ఆశలు చిగురిస్తున్నట్లుగా తెలుస్తోంది. వరుస డిజాస్టర్లతో కోలుకునేందుకు సతమతమవుతున్న బీటౌన్ ఇప్పుడు బ్రహ్మాస్త్ర రాకతో పూర్వవైభవం తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.