టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఉదయం ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తుండగా రిషబ్ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు రోడ్డు పక్కన నిర్మించిన డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ వెంటనే కారులో మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే కారు పూర్తిగా దగ్ధమైంది. అయితే అప్పటికే కారు గ్లాస్ పగలగొట్టి ప్రాణాలతో బయటపడ్డాడు పంత్. కాగా పంత్ ప్రమాదానికి గురయ్యాడన్న విషయం అందరినీ షాక్‌కు గురిచేసింది. అతను త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు ప్రార్థిస్తున్నారు. దీంతో ఈరోజు రిషబ్ పంత్ పేరు ట్రెండ్ అవుతోంది. ఇదే సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా తన సోషల్ మీడియాలో ఒక పోస్టును షేర్ చేసింది. పంత్ పేరు నేరుగా ప్రస్తావించకుండా.. ప్రార్థిస్తున్నాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టును పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే ఆమెను విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
‘పంత్ భాయ్ హాస్పిటల్లో ఉంటే మీరు ఇలాంటి హాట్ ఫోటోలు షేర్ చేయడం తగదు.. వెంటనే ఆస్పత్రికి వెళ్లి రిషబ్‌ను కలవండి’ అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు ‘ప్రమాదం జరిగిన సమయంలో ఇలాంటి పోస్టులు పెట్టద్దు’ అని రియాక్ట్ అయ్యారు. కాగా ఊర్వశీ-రిషభ్ పంత్ మధ్య గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో కోల్డ్‌వార్ నెలకొన్న సంగతి తెలిసిందే. డైరెక్టుగా పంత్ పేరు చెప్పకుండానే ‘ఆర్పీ’ అనే పేరుతో ఊర్వశి పోస్టులు చేయడం, దానికి తగ్గట్టుగానే పంత్ రియాక్ట్ అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. మొదట తనకోసం ఓ హోటల్లో ఆర్పీ చాలా సేపు ఎదురుచూశాడని బాలీవుడ్ బ్యూటీ పోస్ట్ పెట్టగా.. కొంతమంది పబ్లిసిటీ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడతారని, ఇలాంటి వాళ్లనే చూస్తే జాలేస్తుందని పంత్ ఊర్వశీని ఉద్దేశిస్తూ ఆ మధ్య పోస్ట్ చేసిన సంగతి విదితమే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..