
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ హోలీ పండుగను ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు తమ హోలీ వేడుకల ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అయితే ఇదే హోలీ ఫోటోలను షేర్ చేసినందుకు ఒక స్టార్ హీరోయిన్ ట్రోలింగ్ కు గురైంది. ఆమె మరెవరో కాదు మతాంతర వివాహం చేసుకున్న బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా. చాలా మంది లాగే ఆమె హోలీ ఆడుతున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో చాలా మంది నెటిజన్లు హీరోయిన్ కు హోలీ విషెస్ చెప్పారు. అదే సమయంలో కొందరు నెటిజన్లు మాత్రం ఆమెను ట్రోల్ చేశారు. నెగెటివ్ కామెంట్స్ తో చిరాకు తెప్పించారు. దీనికి కారణం ఆ ఫోటోలలో సోనాక్షి ఒంటరిగా హోలీ ఆడుతూ కనిపించడమే. తన వెంట భర్త జహీర్ ఇక్బాల్ కనిపించకపోవడంతో నెటిజన్లు సోనాక్షిపై ప్రశ్నల వర్షం కురిపించారు. నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేశారు.
సోనాక్షి సిన్హా తన చిరకాల ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను జూన్ 23, 2024న వివాహం చేసుకుంది. ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందినవారు. అందుకే వారిద్దరూ తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇది సోనాక్షి వివాహం తర్వాత జరుపుకున్న మొదటి హోలీ. జహీర్ తో ఆమె ఫోటోల కోసం జనాలు ఎదురు చూస్తున్నారు, కానీ సోనాక్షి తన మొదటి హోలీని ఒంటరిగా జరుపుకుంది. ఈ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత ఈ జంటపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. సోనాక్షి తన అభిమానులకు ఫోటోలతో హోలీ శుభాకాంక్షలు తెలిపింది, కానీ ఆమె ఒంటరిగా హోలీ ఎందుకు ఆడుతున్నారు? జహీర్ ఆమెతో ఎందుకు హోలీ ఆడటం లేదు వంటి అనేక ప్రశ్నలు అడిగారు.
చాలా మంది నెటిజన్లు జహీర్ ఎక్కడ అని ప్రశ్నలు అడిగారు. కొంతమంది ‘అతను రంజాన్ జరుపుకోవడానికి వెళ్లి ఉంటాడు’ అని చిరాకు తెప్పించారు. దీంతో చివరకు, సోనాక్షి ఈ ట్రోల్స్ అన్నింటికీ తగిన సమాధానం ఇచ్చింది. ‘‘హోలీ వచ్చేసింది. హ్యాపీ హోలీ. రంగులు చల్లండి. సంతోషాన్ని పంచండి. నేను ప్రస్తుతం ‘జటాధర’ షూట్‌లో ఉన్నాను. ఈ సెట్‌లోనే హోలీ వేడుకలు చేసుకున్నాను. . కామెంట్స్ చేసే వారందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి. జహీర్ ప్రస్తుతం ముంబయిలో ఉన్నాడు. మేమిద్దరం ఒకే చోట లేకపోవడం వల్ల హోలీ వేడుకలు కలిపి చేసుకోలేకపోయాం. మా గురించి ఆలోచించి మీ తలలు వేడెక్కి ఉండొచ్చు. తలపై కాస్త నీళ్లు చల్లుకోండి’’ అని కౌంటర్ ఇచ్చింది సోనాక్షి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.