Pushpa Song: పుష్ప సినిమా హ్యాంగోవర్ ఇంకా వదలడం లేదు. ఏ సోషల్ మీడియా సైట్ ఓపెన్ చేసినా పుష్ప రీల్స్‌తో హోరెత్తుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ పుష్ప సినిమా పాటలకు స్టెప్పులేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నుంచి మొదలు, టాలీవుడ్ వరకు ప్రముఖ నటీమణులు పుష్ప సినిమా పాటలకు కాలు కదుపుతూ నెటిజన్లను ఫిదా చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోని బాలీవుడ్ బ్యూటీ రాఖీ సవంత్ వచ్చి చేరారు. పుష్ప సినిమాలోని పాటకు కాలు కదిపిన ఈ బిగ్‌బాస్ బ్యూటీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
పుష్ప సినిమాలోని ‘సామి సామి’ పాట హిందీ వెర్షన్‌కు డ్యాన్స్ చేసిన రాఖీ హంగామా చేశారు. స్నేహితుడు రాజీవ్ కించితో కలిసి స్టెప్పులేశారు. ఈ వీడియోను కాస్త ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రాఖీ డ్యాన్స్ చూసిన ఆమె ఫ్యాన్స్ లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. ఇక రాఖీ సవంత్ మంచి డ్యాన్సర్‌గా పేరు సంపాదించుకున్న రాఖీ, సినిమాలతో పాటు కాంట్రవర్సీల విషయంలో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.
గతంలో తన వివాహ సమయంలో స్వయం వరాన్ని ప్రకటించి అందరి దృష్టి ఆకర్షించిన రాఖీ, ఇటీవల వివాహ బంధానికి బ్రేకప్‌తో మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఫిబ్రవరి 14న భర్త రితేశ్ సింగ్ ఉంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన రాఖీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే.
Also Read: అక్క పెళ్ళిలో చెల్లెలు సందడి !! బిజిలీ బిజిలీ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు.. వీడియో
విమానంలో అనుకోని అతిథి !! ఒక్కసారిగా షాక్ అయిన ప్రయాణికులు !! వీడియో
Swiss Bank Leak: స్విస్ బ్యాంకులో ఆ మిలిటరీ అధికారికి అకౌంట్.. సమాచారం లీక్..