విమానంలో అనుకోని అతిథి !! ఒక్కసారిగా షాక్ అయిన ప్రయాణికులు !! వీడియో
మీరు ఏ విదేశాలకో వెళ్తూ విమానం ఎక్కారు. విమానం గాల్లోకి ఎగిరింది... అంతా సవ్యంగా సాగుతున్న టైంలో సడన్‌గా మీకు ఊహించని సంఘటన ఎదురైతే.... అయితే ఏంటి... అయింది...
మీరు ఏ విదేశాలకో వెళ్తూ విమానం ఎక్కారు. విమానం గాల్లోకి ఎగిరింది… అంతా సవ్యంగా సాగుతున్న టైంలో సడన్‌గా మీకు ఊహించని సంఘటన ఎదురైతే…. అయితే ఏంటి… అయింది… ఎయిర్ ఏషియాకు చెందిన ఎయిర్ బస్ ఏ320-200 అనే విమానం మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి తవావు అనే పట్టణానికి వెళుతోంది. విమానం గాల్లోకి ఎగిరింది. కొన్ని వందల మీట్ల ఎత్తులో సాఫీగా ప్రయాణం సాగుతోంది. ఇంతలో ఊహించని విధంగా విమానంలో ఉండే లైటింగ్స్‌లో ఓ పాము దర్శనమిచ్చింది. దీంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. అయితే ఆ పాము లైట్ బాక్స్ నుంచి బయటకు రాకపోవడంతో తమ స్మార్ట్ ఫోన్‌లకు పని చెప్పారు ప్రయాణికులు. వీడియో రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో శరవేగంగా సోషల్ మీడియాలో వ్యాపించింది.
వైరల్ వీడియోలు
Latest Videos