Jacqueline Fernandez: బాలీవుడ్‌లో మరో రచ్చ.. రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌తోపాటు నోరా ఫతేకు ఈడీ సమన్లు

|

Oct 14, 2021 | 12:40 PM

Money Laundering Case: బాలీవుడ్‌ నటి నోరా ఫతేతోపాటు జాక్వెలిన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. 2 వందల కోట్ల రూపాయల మనీలాండరింగ్‌ కేసులో నోరా ఫతేకు ఈడీ..

Jacqueline Fernandez: బాలీవుడ్‌లో మరో రచ్చ.. రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌తోపాటు నోరా ఫతేకు ఈడీ సమన్లు
Nora Fatehi And Jacqueline
Follow us on

బాలీవుడ్‌ నటి నోరా ఫతేతోపాటు జాక్వెలిన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. 2 వందల కోట్ల రూపాయల మనీలాండరింగ్‌ కేసులో నోరా ఫతేకు ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఇదే కేసులు జాక్వెలిన్‌ను ప్రశ్నించింది ఈడీ. నెలరోజుల క్రితం జాక్వెలిన్‌ విచారించింది. 2017ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన లంచం కేసులో అరెస్ట్ అయిన చంద్రశేఖర్‌ని విచారించగా పలువురి పేర్లు బ‌య‌ట‌పడ్డాయి. అందులో బాలివుడ్ బ్యూటీ జాక్వెలిన్ పేరు కూడా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. తీహార్ జైలు లోపల నుంచే దాదాపు 200 కోట్ల విలువైన దోపిడీ రాకెట్ నడుపుతున్నట్టు చంద్రశేకర్ పై ఆరోపణలున్నాయి.

నోరా ఫతేను పిలిపించి పలు అంశంపై విచారణ జరుపనున్నారు. ఈ విషయంలో నోరా ఫతే సమాధానాన్ని రికార్డ్ చేయనుంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. సురేష్ కేవలం నోరా ఫతే పేరు మాత్రమే కాకుండా నటి జాక్వెలిన్ ఫెర్నాండస్‌ని కూడా పేరు చెప్పినట్లుగా తెలుస్తోంది. నోరా ఫతేహీతో పాటు నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్‌ని ED రీకాల్ చేసింది. విచారణలో చేరడానికి రేపు (శుక్రవారం) ఎమ్‌టిఎన్‌ఎల్‌లోని ఇడి కార్యాలయానికి జాక్వెలిన్‌ను ఈడి పిలిచింది.  

చాలా మంది కళాకారులను పట్టుకోవడానికి ప్రయత్నించారు.

గతంలో జాక్వెలిన్‌ను కూడా ED ప్రశ్నించింది. ఈ కేసులో జాక్వెలిన్ ప్రమేయం ఉందని మొదట ED భావించింది. కానీ తర్వాత ఆమె ఈ కేసు బాధితురాలని గుర్తించారు. సుకేష్ లీనా పాల్ ద్వారా జాక్వెలిన్‌ను మోసం చేశాడు. జాక్వెలిన్ ED కి తన మొదటి స్టేట్‌మెంట్‌లో సుకేష్‌కు సంబంధించిన అనేక ముఖ్యమైన సమాచారాన్ని అందించినట్లుగా తెలుస్తోంది.

సుఖేష్ చంద్ర శేఖర్ అతని భార్య నటి లీనా పాల్ తీహార్ జైలు లోపల నుంచే 200 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. చాలా మందిలాగే సుఖేష్ కూడా నోరా ఫతేహిని చిక్కుల్లో పడేయడానికి పథకం వేశాడని అంటారు. నోరా, జాక్వెలిన్ లతో పాటు  సుఖేష్ చాలా మంది బాలీవుడ్ నటులు చిత్రనిర్మాతల లక్ష్యంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి: Teacher Beating: అమ్మో.. సారు కొట్టుడు మాములుగా లేదుగా.. విద్యార్థులను మరో రేంజ్‌లో చితకబాదిన టీచర్..

Potato Cheela Recipe: ఆలుతో అద్భుమైన బ్రేక్‌ఫాస్ట్.. పిజ్జాను మించిపోయే రుచి.. ఇంకెందుకాలస్యం

SBI: దాచుకోవడమే కాదు.. సంపాదించడం కూడా తెలుసుకోండి.. ఎస్‌బీఐ అందించే అద్భతమైన డిపాజిట్ స్కీమ్..

Chanakya Niti: జీవితంలో ఈ మూడింటిని వదిలేస్తే.. ధన లక్ష్మి మీ ఇంటి తలుపులు తడుతుంది..