Aryan Khan drugs case: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ లభించని ఊరట.. ఇంకా జైల్లోనే.. హైకోర్టే దిక్కు..

|

Oct 20, 2021 | 5:40 PM

ఆర్యన్ ఖాన్.. ఇప్పుడు ఈ పేరు ఎక్కడ చూసిన మారు మ్రోగుతుంది. డ్రగ్స్ కేసులో చిక్కుకున్న షారుఖ్ ఖాన్ తనయుడు నానా అవస్థలు పడుతున్నాడు.

Aryan Khan drugs case: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ లభించని ఊరట.. ఇంకా జైల్లోనే.. హైకోర్టే దిక్కు..
Aryan Khan
Follow us on

Aryan Khan drugs case: ఆర్యన్ ఖాన్.. ఇప్పుడు ఈ పేరు ఎక్కడ చూసిన మారు మ్రోగుతుంది. డ్రగ్స్ కేసులో చిక్కుకున్న షారుఖ్ ఖాన్ తనయుడు నానా అవస్థలు పడుతున్నాడు. చిన్నతనం నుంచి రాజభోగాలు అనుభవించిన ఆర్యన్.. ఇప్పుడు జైల్లో ఊహించిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్‌పై దాడి చేసి డ్రగ్స్ పార్టీ చేస్తున్న చాలా మందిని అరెస్టు చేసింది ఎన్సీబీ. అందులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నారు. ఆర్యన్‌తో పాటు, ఎన్‌సిబి అధికారులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఆర్యన్ కుటుంబం విషాదం నెలకొంది. కొడుకు అరెస్ట్ అవ్వడంతో షారుక్ కూడా బయటకు రావడంలేదు. ఇక తల్లి గౌరీ ఖాన్ కూడా నిద్రాహారాలు మానేసి ఎక్కువ సమయం దేవుడి ప్రార్ధనలతోనే గడిపేస్తున్నారని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఆర్యన్ కు బెయిల్ వస్తుందని షారుఖ్ కుటుంబసభ్యులతో పాటు ఆయన అభిమానులు కూడా భావించారు. ఇప్పటికే మూడుసార్లు కోర్టును ఆశ్రయించిన మూడుసార్లు ఆర్యన్ బెయిల్ ను నిరాకరించింది కోర్టు. నేడు జరిగిన వాదప్రతివాదనల అంతరం మరోసారి ఆర్యన్ కు షాక్ తగిలింది. మూడో సారికూడా కోర్టులో చుక్కెదురైంది. ఆర్యన్ కు బెయిల్ వస్తుదని అనుకున్నవారికి ఊహించని షాక్ తగిలింది. ముంబై సెషన్ కోర్టులో మరోసారి బెయిల్ రిజెక్ట్ అయ్యింది.  న్యాయవాదులు పదేపదే ప్రయత్నించినప్పటికీ, ఆర్యన్ బెయిల్ పిటిషన్ పదేపదే తిరస్కరణకు గురవుతోంది. ఇదిలా ఉంటే బెయిల్ కోసం ఆర్యన్ తరపు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించనున్నారని తెలుస్తుంది. కింది కోర్టులో బెయిల్ రాకపోయినా హైకోర్టులో తప్పకుండా బెయిల్ వస్తుందని భావిస్తున్నారు షారుఖ్ కుటుంబసభ్యులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Keerthy Suresh: ఇక పై అలాంటి సినిమాలు చేయనంటున్న ముద్దుగుమ్మ.. సంచలన నిర్ణయం తీసుకున్న కీర్తిసురేష్..

BiggBoss 5 Telugu : వార్‌కు దిగిన సన్నీ- ప్రియా.. ‘చెంప పగిలిద్ది అంటూ.. దమ్ముంటే కొట్టి చూడు అంటూ’.. రెచ్చిపోయిన కంటెస్టెంట్స్..

Aryan Khan: షారుఖ్‌కు మరో షాక్ .. ఆర్యన్ ఖాన్‌‌కు దొరకని బెయిల్.. నిరాశలో అభిమానులు..