Paresh Rawal: కరోనా బారిన పడిన మరో నటుడు.. టీకా వేసుకున్నా ఫలితం లేదు.. పాజిటివ్ గా నిర్ధారణ

|

Mar 27, 2021 | 11:42 AM

Paresh Rawal: దేశవ్యాప్తంగా కోవిడ్ 19 వాక్సిన్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది వాక్సిన్ తీసుకున్నారు. సెలబ్రిటీలు కూడా కరోనా వ్యాక్సినేషన్ చేయించుకుంటున్నారు.

Paresh Rawal: కరోనా బారిన పడిన మరో నటుడు.. టీకా వేసుకున్నా ఫలితం లేదు.. పాజిటివ్ గా నిర్ధారణ
Paresh Rawal
Follow us on

Paresh Rawal: దేశవ్యాప్తంగా కోవిడ్ 19 వాక్సిన్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది వాక్సిన్ తీసుకున్నారు. సెలబ్రిటీలు కూడా కరోనా వ్యాక్సినేషన్ చేయించుకుంటున్నారు. కాగా నటుడు, మాజీ ఎంపీ పరేష్ రావెల్ కూడా ఈ నెల ప్రారంభంలో వ్యకిన్స్ వేయించుకున్నారు. అయితే ఇప్పుడు ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా పరేష్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.

కాగా తనతో గత పదిరోజులుగా ఎవరెవరితే తిరిగారో వారందరు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా పరేష్ కోరారు.  కాగా మార్చి 9 న పరేష్ రావల్ తన మొదటి టీకా తీసుకున్నారు.  ఆవిషయాన్ని ట్వీట్‌లో వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపారు పరేష్ రావెల్. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్ రావడం ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. ఇక దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 62,258 కొత్త కరోనావైరస్ కేసులను నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో, మిలింద్ సోమన్, ఆర్ మాధవన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్, రోహిత్ సరఫ్, సిద్ధాంత్ చతుర్వేది, మనోజ్ బాజ్‌పేయి వంటి సినిమా తారలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూల్కర్ కూడా కరోనా బారిన పడ్డారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Karthika Deepam Serial: పిల్లల కోసం బయలుదేరిన కార్తీక్.. అయినా మోనిత వైపే ఆలోచనలు.. మరోవైపు ఆసుపత్రిలో దీప..

చరణ్ బర్త్ డే.. ఫ్యాన్స్ కు డబుల్ సర్‌‌‌‌‌‌‌ప్రైజ్ ఇచ్చిన ‘ఆచార్య’ టీమ్.. ఆకట్టుకుంటున్న మెగాపవర్ స్టార్ లుక్

Happy Birthday Ram Charan: మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చి… తన క్రేజ్‌‌‌‌ను కంట్రీ దాటించిన రామ్ చరణ్