
డ్రగ్స్ కేసులో ముంబై జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు.. తన తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కల్పించారు. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా కన్నీటి పర్యంతమైనట్టుగా తెలుస్తోంది. జైలులో ఉన్న ప్రతి వ్యక్తి.. వారానికి రెండు సార్లు కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే వెసులు బాటు ఉంటుంది. అలాగే ఆర్యన్‌కు కూడా వీడియో కాన్ఫరెన్స్ అవకాశం కల్పించారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన సెషన్స్ కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. అక్టోబర్ 20వ తేదీ వరకు తీర్పును రిజర్వ్‌లో పెట్టారు న్యాయమూర్తి. దీంతో ఆర్యన్ మరో ఐదు రోజుల పాటు ఆర్ధర్ రోడ్ జైలులో ఉచలు లెక్క పెట్టాల్సిందే.
కరోనా పరీక్షల్లో ఆర్యన్‌తో పాటు ఆర్భాజ్‌కు నెగెటివ్ రావడంతో సాధారణ సెల్‌కు తరలించారు. అక్టోబర్ రెండో తేదీన ముంబై క్రూయిజ్‌లో డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డాడు ఆర్యన్. అతని బెయిల్ పిటిషన్‌పై వరుసగా రెండో రోజు కూడా ముంబై సెషన్స్ కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను మరోసారి వ్యతిరేకించారు ఎన్సీబీ తరపు న్యాయవాది .
అయితే ఎన్పీబీ ఆరోపణలను ఆర్యన్ తరపు న్యాయవాదులు కొట్టిపారేశారు. సెలబ్రిటీల పిల్లలైన్నంత మాత్రాన బెయిల్ ఇవ్వరాదని చట్టంలో ఎక్కడ లేదని కౌంటరిచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి తీర్పును ఈనెల 20వ తేదీ వరకు రిజర్వ్‌లో పెట్టారు.
ఇవి కూడా చదవండి: RK: ఆర్కే నిజంగానే చనిపోయాడా.. వెంటాడుతున్న ఓ అనుమానం.. అది నిజమేనా..
Dasara – Jimmy: దసరా రోజున జమ్మి చెట్టును ఇలా పూజిస్తే.. కుబేరుడు మీ ఇంట్లో..