Ankita Lokhande On Break-Up: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణంతో యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. అతని ఆత్మహత్యకు గల కారణాలు ఎవరికీ తెలియక పోయినా .. ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో సెలబ్రెటీలనుంచి సామాన్యుల వరకూ కన్నీరు పెట్టుకున్నారు. ఇక సుశాంత్ మరణంతో అతని అభిమానులు అంకితా లోఖండేను ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు.
సుశాంత్ తో బ్రేకప్ కు కారణం పై అంకిత తొలిసారిగా బహిరంగంగా స్పందించింది. తాను ఎప్పుడూ సుశాంత్ ను విడిచిపెట్టలేదని.. అతనే తనకు బ్రేకప్ చెప్పి.. విడిపోయాడని అంకిత చెప్పింది. తమ రిలేషన్ ను అందరికీ తమాషాగా చూపించడం తనకు ఇష్టం లేదని.. అందుకనే ఇంతకాలం మౌనంగా ఉన్నానని చెప్పింది అంకిత. తనతో విడిపోయినందుకు ఎప్పుడూ సుశాంత్ ను తప్పపట్టలేదని… అయితే అతని మరణంతో తనని ట్రోల్ చేయడంతో బాధపడ్డానని తెలిపింది.
ఈరోజు అందరూ నాదగ్గరకు వచ్చి అడుగుతున్నారు.. మీరు సుశాంత్ ను ఎలా విడిచిపెట్టారు అని.. అయితే వారందరినీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నా.. అసలు సుశాంత్ కు నాకు మధ్య ఎం జరిగింటే ఎవరికైనా ఏమైనా తెలుసా..? మరి ఎందుకు పదే పదే అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు అని ప్రశ్నించింది. అంతేకాదు.. తానూ ఎవరినీ నిందించడం లేదని.. సుశాంత్ తన కెరీర్ పై ఫోకస్ పెట్టి.. ముందుకు సాగాలనుకున్నాడు. అతను తన వృత్తిని ఎంచుకుని ముందుకు వెళ్ళిపోయాడు.. ఆ సమయంలో తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాని తెలిపింది అంకిత. తన కెరీర్ లో ముందుకు సాగడం అంత సులభం కాదు.. అయితే తన కుటుంబం ఎప్పుడూ తనతోనే ఉంటుందని తెలిపింది అంకిత. నాకు సుశాంత్ కు మధ్య ఉన్న జీవితం ముగిసింది. నేను ఎవరినీ నిందించడం లేదు. నేను సుశాంత్ తో జీవితాన్ని పంచుకుందామని అనుకున్నా.. అయితే కుదరలేదు. అభిమానుల ఆరోపణలతో తాను ఎంతగానో విసిగిపోయానని తెలిపింది అంకిత.
తనను నిందిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లను ఉద్దేశించి అంకిత మాట్లాడుతూ.. అసలు ఈరోజు అందరూ సుశాంత్ మరణం గురించి మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుతున్నారు.. మరి వీరందరూ సుశాంత్ నన్ను వదిలేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించింది. అసలు ఇప్పుడు సుశాంత్ లేడు.. అతనిపై నాకు ఏ విధమైన వ్యతిరేకత లేదు.. కానీ ఇకనైనా సుశాంత్ అభిమానులు తనను ట్రోల్ చేయడం మానేయాలని కోరింది. అంకిత 2019 సంవత్సరంలో, కంగనా రనౌత్ చిత్రం మణికర్ణికతో నటిగా వెండి తెరపై అడుగు పెట్టింది. అనంతరం బాఘి 3 చిత్రంలో కనిపించింది.
Also Read: సరిహద్దులో కొత్త కుట్రకు డ్రాగన్ తెర.. భూమ్మీది నుంచి సముద్ర జలాల దాకా చైనా కుట్రలే కుట్రలు