Shilpa Shetty: డైరెక్టర్ చెప్పాడని నిజంగానే కాలు విరగొట్టుకున్న హీరోయిన్.. అయ్యో పాపం అంటున్న నెటిజన్స్..

|

Aug 10, 2022 | 4:50 PM

వాళ్లు చెప్పారు రోల్, కెమెరా యాక్షన్.. కాలు విరగొట్టండి అని. నేను అక్షరాల దానిని పాటించాను. ఇక 6 వారాలు

Shilpa Shetty: డైరెక్టర్ చెప్పాడని నిజంగానే కాలు విరగొట్టుకున్న హీరోయిన్.. అయ్యో పాపం అంటున్న నెటిజన్స్..
Shilpa Shetty
Follow us on

బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి (Shilpa Shetty) షూటింగ్‏లో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని శిల్పా స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. అందులో ఆమె కాలుకు పెద్ద కట్టుతో వీల్ చైర్ లో కూర్చుని ఉన్నారు. ” వాళ్లు చెప్పారు రోల్, కెమెరా యాక్షన్.. కాలు విరగొట్టండి అని. నేను అక్షరాల దానిని పాటించాను. ఇక 6 వారాలు పనిచేయలేను. కానీ నేను తొందర్లోనే మరింత బలంగా మారి తిరిగి వస్తాను. నా కోసం ప్రార్థించండి. మీ ప్రార్ధనలు ఎప్పుడూ పనిచేస్తాయి. కృతజ్ఞతతో మీ శిల్పా శెట్ట” అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆమె త్నరగా కోలుకోవాలంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

శిల్పా శెట్టి షేర్ చేసిన ఫోటోకు ఆమె సోదరి షమితా శెట్టి స్పందిస్తూ.. నా ముంకీ స్ట్రాంగెస్ట్ అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె డైరక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్‏లో నటిస్తుంది. ఇందులో సిద్ధార్థ మల్హోత్రా, శిల్పా శెట్టి, వివేక్ ఒబేరాయ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ఈ సిరీస్ లోని యాక్షన్ సీన్ షూటింగ్ కు సంబంధించిన క్లిప్ ను డైరెక్టర్ రోహిత్ శెట్టి నెట్టింట షేర్ చేసిన సంగతి తెలిసిందే. అందులో సిద్ధార్థ్, శిల్పాశెట్టి ఓ భవనంలో విలన్లతో విరోచితంగా పోరాడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.