Shilpa Shetty: బాలీవుడ్ భామకు ఎంత కష్టం వచ్చిందో.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన శిల్పాశెట్టి

|

Feb 06, 2024 | 8:37 PM

ఫిట్ నెస్ కు ప్రాధాన్యత ఇచ్చే భామ శిల్పా శెట్టి.  ఈ అమ్మడిని ఫిట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా చెప్పొచ్చు.. ఇటీవల శిల్పా శెట్టి నటించిన ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను చూసిన చాలా మంది శిల్పా శెట్టి నటనను మెచ్చుకుంటున్నారు. 48 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా ఉండే శిల్పాశెట్టి యోగా, వర్కౌట్‌లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది.

Shilpa Shetty: బాలీవుడ్ భామకు ఎంత కష్టం వచ్చిందో.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన శిల్పాశెట్టి
Shilpa Shetty
Follow us on

హీరోయిన్స్ ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా బాలీవుడ్ భామలు ఫిట్ నెస్ అంటే ప్రాణం పెడతారు. ఇలా ఫిట్ నెస్ కు ప్రాధాన్యత ఇచ్చే భామ శిల్పా శెట్టి.  ఈ అమ్మడిని ఫిట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా చెప్పొచ్చు.. ఇటీవల శిల్పా శెట్టి నటించిన ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను చూసిన చాలా మంది శిల్పా శెట్టి నటనను మెచ్చుకుంటున్నారు. 48 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా ఉండే శిల్పాశెట్టి యోగా, వర్కౌట్‌లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే శిల్పా శెట్టి రోజూ తన వర్కౌట్స్ వీడియలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.

కొత్త కొత్త వ్యాయామాలు , యోగాసనాలు వేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా శిల్పాశెట్టి ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. తాజాగా శిల్పాశెట్టి రాజస్థాన్  పర్యటించింది. . అంతకుముందు శిల్పాశెట్టి తన యూట్యూబ్ ఛానెల్‌లో చక్కీ చలసానా వీడియోను పోస్ట్ చేసింది.

చక్కీ చలసానా అంటే ఎదో అనుకోకండి విసుర్రాయి తిప్పుతుంటాం కదా.. అలా కూర్చోవడాన్నే చక్కీ చలసానా అంటారు. ఇలా విసుర్రాయి తిప్పే సమయంలో మహిళలు కూర్చున్న భంగిమ అలాగే  ఆ రాయిని తిప్పడం చేసేటప్పుడు శరీరం చాలా బలంగా తయారవుతుంది. చక్కి చలసానా చేతులను బలపరుస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పునరుత్పత్తి అవయవాలను ప్రేరేపిస్తుంది. అలాగే ఇది వెన్నుముక, మోకాలి కండరాలను బలపరుస్తుందని శిల్పాశెట్టి చెప్పుకొచ్చింది. ఒకప్పుడు గోధుమలు నూరడానికి తిరగలి ఉండేది. అప్పటి మహిళలు దాన్ని వాడే పిండి తయారు చేసేవారు. అందుకే వాళ్ళు అంత బలంగా ఉండేవారు. ఇక ఇప్పుడు శిల్ప ఈ వీడియో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది.

శిల్పాశెట్టి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.