AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nehal Shah: బర్త్ డే పార్టీలో డ్రగ్స్.. బాలీవుడ్ నటిని అరెస్ట్ చేసిన పోలీసులు..

బాలీవుడ్ నటి నేహాల్‏ షాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఖరీదైన హోటల్ లో నటి తన స్నేహితులతో కలిపి జరుపుకున్న బర్త్ డే పార్టీలో డ్రగ్స్

Nehal Shah: బర్త్ డే పార్టీలో డ్రగ్స్.. బాలీవుడ్ నటిని అరెస్ట్ చేసిన పోలీసులు..
Nehal Shah
Rajitha Chanti
|

Updated on: Jun 15, 2021 | 6:39 PM

Share

బాలీవుడ్ నటి  నేహాల్‏ షాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఖరీదైన హోటల్ లో నటి తన స్నేహితులతో కలిపి జరుపుకున్న బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగించారన్న ఆరోపణలతో నటితోపాటు.. ఆమె స్నేహితుడు అశిక్ సాజిద్ హుస్సేన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు… శాంతాక్రూజ్ పోలీసుల ప్రకారం జుహులోని ఫైవ్ స్టార్ హోటల్‏లో నటి నేహాల్ షా తన బర్త్ డే సందర్భంగా స్నేహితులకు పార్టీ ఇచ్చింది. ఈ వేడుకకు గోవాకు చెందిన తన స్నేహితుడు ఆశిక్ హుస్సేన్ కూడా హాజరయ్యాడు. వీరిద్ధరూ కలిసి పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో తెల్లవారు జామున 3.30 గంటలకు హోటల్ పై పోలీసులు దాడి చేశారు. నటి నైరా, ఆమె స్నేహితుడు ఆశిక్ ఇద్దరూ చారస్ తినేవారని పోలీసులు గుర్తించారు.

ఇక అంధేరిలోని కూపర్ ఆసుపత్రిలో వీరిద్దరికి కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాత వీరిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత వీరిని కోర్టులో హాజరుపర్చగా.. బెయిల్ లభించిందని పోలీసులు తెలిపారు. అలాగే వీరికి మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంపై విచారణ జరుపుతున్నట్లుగా ముంభై పోలీసులు తెలిపారు. అలాగే వీరికి మాదకద్రవ్యాల్ని సరఫరా చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నేహాల్ షా పలు బాలీవుడ్ సినిమాలతోపాటు తెలుగు సినిమాల్లో నటించింది.

Also Read: Hyper Aadi: ‘నేను కేవలం ఆర్టిస్ట్‏ను మాత్రమే.. అది పొరపాటే.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను’.. హైపర్ ఆది.. 

Maoist Sympathisers : తూ.గో జిల్లా మన్యంలో మావోలకు లక్షల రూపాయల సొమ్ములు తరలిస్తోన్న సానుభూతిపరులు అరెస్ట్

National Pension System: జాతీయ పెన్షన్ విధానంలో మార్పులపై పరిశీలన..మొత్తం సొమ్ము ఒకేసారి ఉపసంహరించుకునే అవకాశం

Monsoon Recipes: వర్షాకాలంలో ఈ బెస్ట్ స్నాక్స్ సులభంగా ఇంట్లోనే చేసుకోని ఎంజాయ్ చేయండి..