Kiara Advani: తొందరగా అమ్మ కావాలని ఉందంటోన్న కియారా.. కారణం విని ఆశ్చర్యపోతున్న నెటిజన్స్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విదేయ రామా సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో తెలుగులో పూర్తిగా అవకాశాలు దూరమయ్యాయి. దీంతో ఆమె బీటౌన్ పై ఫుల్ ఫోకస్ పెట్టి అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది. ప్రస్తుతం ఆమె గేమ్ ఛేంజర్ చిత్రంలో మరోసారి చెర్రీకి జోడిగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. తాజాగా కియారాకు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Kiara Advani: తొందరగా అమ్మ కావాలని ఉందంటోన్న కియారా.. కారణం విని ఆశ్చర్యపోతున్న నెటిజన్స్..
Kiara Advani,sidharth Malho

Updated on: Jul 30, 2023 | 3:12 PM

తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సుపరిచితమే. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కియారాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇక ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విదేయ రామా సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో తెలుగులో పూర్తిగా అవకాశాలు దూరమయ్యాయి. దీంతో ఆమె బీటౌన్ పై ఫుల్ ఫోకస్ పెట్టి అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది. ప్రస్తుతం ఆమె గేమ్ ఛేంజర్ చిత్రంలో మరోసారి చెర్రీకి జోడిగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. తాజాగా కియారాకు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

అందులో కియారా మాట్లాడుతూ.. తన త్వరగా ప్రెగ్నెంట్ కావాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. 2019లో వచ్చిన గుడ్ న్యూస్ సినిమా రిలీజ్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు త్వరగా ప్రెగ్నెంట్ కావాలని ఉందని.. ఆ సమయంలో తనకు నచ్చింది తినొచ్చని.. అందుకు అడ్డు చెప్పేవారే ఉండరని తెలిపింది. అలాగే తనకు పుట్టబోయే బిడ్డ అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉంటే చాలని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. 2021లో షేర్షా సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లు ప్రేమలో ఉన్న వీరు ఈ ఏడాది మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్ లో వీరి వివాహం జరిగింది. ఇటీవల ఓ ఈవెంట్లో కియారా పొట్ట కాస్త పెద్దదిగా కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్ చేశారు నెటిజన్స్. అయితే ఆ తర్వాత మళ్లీ నాజూగ్గా మారి కనిపించడంతో ఆ వార్తలకు చెక్ పడింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us