Kajol: కరణ్ జోహార్‌పై ఫైర్ అయిన కాజోల్.. మనోడు ఏం చేశాడంటే..

స్టార్ కిడ్స్ ను చాలా వరకు ఆయనే ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్‌తో కరణ్ కు చాలా ఏళ్లుగా స్నేహం ఉంది. రీసెంట్ గా కాజోల్ 'కాఫీ విత్ కరణ్' షోకి గెస్ట్ గా వచ్చింది. ఈసారి కరణ్ జోహార్ ప్రవర్తన కాజోల్ కి అంతగా నచ్చలేదు. అందుకే కరణ్  సూటిగా విమర్శించింది.

Kajol: కరణ్ జోహార్‌పై ఫైర్ అయిన కాజోల్.. మనోడు ఏం చేశాడంటే..
Kajol

Updated on: Nov 30, 2023 | 5:01 PM

నిర్మాత, దర్శకుడు, సమర్పకుడు కరణ్ జోహార్‌కు బాలీవుడ్‌లో దాదాపు అందరితో మంచి స్నేహం ఉంది. ఆయన చాలా మందికి గాడ్ ఫాదర్. స్టార్ కిడ్స్ ను చాలా వరకు ఆయనే ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్‌తో కరణ్ కు చాలా ఏళ్లుగా స్నేహం ఉంది. రీసెంట్ గా కాజోల్ ‘కాఫీ విత్ కరణ్’ షోకి గెస్ట్ గా వచ్చింది. ఈసారి కరణ్ జోహార్ ప్రవర్తన కాజోల్ కి అంతగా నచ్చలేదు. అందుకే కరణ్  సూటిగా విమర్శించింది. దీనంతటికీ కారణం రణవీర్ సింగ్! రణవీర్ సింగ్ విషయం ఎందుకొచ్చింది అంటే…

‘కాఫీ విత్ కరణ్’ తాజా ఎపిసోడ్ కోసం రాణి ముఖర్జీ , కాజోల్ కలిసి వచ్చారు. ఈ సమయంలో కరణ్ జోహార్‌కి రణవీర్ సింగ్ నుండి ఫోన్ వచ్చింది. షో షూటింగ్ మధ్య కాల్ అందుకున్న కరణ్ జోహార్ చాలా సేపు మాట్లాడాడు. దీనితో రాణి ముఖర్జీ, కాజోల్ వెయిట్ చేయాల్సి వచ్చింది. కరణ్ జోహార్ ప్రవర్తనను కాజోల్ ‘అన్ ప్రొఫెషనల్’ అని పేర్కొంది. అలాగే అతని పై ఆమె ఫైర్ అయ్యిందని తెలుస్తోంది.

కాఫీ విత్ కరణ్’ కొత్త ఎపిసోడ్ నవంబర్ 30 రాత్రి ప్రసారం కానుంది. ఈ షో ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ OTTలో ప్రసారం అవుతోంది. 7 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో 8వ సీజన్ ఇప్పుడు ప్రసారమవుతోంది. ఈ షోలో కరణ్ జోహార్ చాలా వివాదాస్పద ప్రశ్నలు అడిగాడు. అందుకే కొందరు సెలబ్రిటీలు ఈ షోకి రావడానికి వెనుకాడుతున్నారు. అంతకు ముందు రణబీర్ కపూర్ తీవ్ర పదజాలంతో విమర్శించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక 8వ సీజన్‌లో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె కలిసి కనిపించారు. ఈ సమయంలో, దీపికా పదుకొణె తన పాత సంబంధం గురించి మాట్లాడింది. రణ్‌వీర్ సింగ్‌తో డేటింగ్ చేస్తున్నప్పుడు ఇతర పురుషులతో పరిచయం ఉందని అనడంతో ఆమెను నెటిజన్స్ ట్రోల్  చేశారు. ఇక ఇప్పుడు రాణి ముఖర్జీ మరియు కాజోల్ ఎపిసోడ్ నుండి ఎలాంటి వివాదం తలెత్తుతుందో వేచి చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.