Kajol: సీనియర్ హీరోయిన్ రేవతి దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ .. ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభం..

|

Feb 12, 2022 | 5:06 PM

ఇద్దరూ స్టార్ హీరోయిన్లు.. ఒకరు సౌత్ ఇండస్ట్రీలో.. మరోకరు నార్త్‏లో. ఒకప్పుడు వరుస చిత్రాలతో చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన

Kajol: సీనియర్ హీరోయిన్ రేవతి దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ .. ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభం..
Kajol
Follow us on

ఇద్దరూ స్టార్ హీరోయిన్లు.. ఒకరు సౌత్ ఇండస్ట్రీలో.. మరోకరు నార్త్‏లో. ఒకప్పుడు వరుస చిత్రాలతో చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన ఈ స్టార్ హీరోయిన్స్.. ఇప్పుడు మరోసారి సెట్స్‏లో కలుసుకున్నారు. అంతేకాదు.. ఇందులో ఒకరు దర్శకురాలిగా సినిమా చేస్తుండగా.. మరోకరు అందులో కీలకపాత్రలో నటించనున్నారు. ఇంతకీ ఎవరా అని ఆలోచిస్తున్నారా. ? వారిద్దరూ మరెవరో కాదండోయ్.. బాలీవుడ్ బ్యూటీ కాజల్ దేవగణ్ (Kajol).. మరొకరు నటి రేవతి (Revathi). వీరిద్దరి కాంబోలో ఇప్పుడు ఓ సినిమా రాబోతుంది.

సీనియర్ నటి రేవతి దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ కాజల్ దేవగణ్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం సలామ్ వెంకీ. ఈ సినిమా శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా హీరోయిన్ కాజోల్ మాట్లాడుతూ.. అందరికీ చెప్పాల్సిన ఓ కథతో మా జర్నీ మొదలు పెట్టాం. గమ్యం చేరుకోవడానికి తీసుకోవాల్సిన మార్గం, జీవితాన్ని ఏలా సెలబ్రెట్ చేసుకోవాలి ? అనే అంశాలతో ఈ సినిమా కథ ఉంటుంది. నమ్మలేని ఓ నిజమైన కథను ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం.. అంటూ కాజల్ చెప్పుకొచ్చారు.

Also Read: Sudheer Babu: కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించిన సుధీర్‌ బాబు.. ఆసక్తికరంగా ఫస్ట్‌ లుక్‌..

Meenakshi Chaudhary: వరుస అవకాశాలు అందుకుంటున్న హర్యానా బ్యూటీ “మీనాక్షి చౌదరి”..(ఫొటోస్)

Geetha Madhuri: సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ ‘గీత మాధురి’ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో సింగర్ లేటెస్ట్ ఫొటోస్..

Keerthy Suresh : మహేష్ సినిమాకోసం ఈ ముద్దుగుమ్మ మొదటిసారి అలా కనిపించనుందట..