బాలీవుడ్ టాప్ హీరోలలో ఇమ్రాన్ హాష్మీ ఒకరు. విభిన్న సినిమాలను చేస్తూ విలక్షణ నటుడుగానూ పేరుతెచ్చుకున్నాడు ఈ హీరో. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తిచేసుకున్న ఇమ్రాన్ బాలీవుడ్ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.. రంగుల ప్రపంచం మొత్తం ఫేక్ అని.. అందుకే పని పూర్తయ్యక తనకు ఇండస్ట్రీతోనే సంబంధం లేదన్నట్లుగా దూరంగా ఉంటానని తెలిపాడు. తాజాగా ఇమ్రాన్.. సిద్ధార్థ్ ఖన్నా వ్యాఖ్యాతగా వ్యవహరించిన రేడియో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
“ఇక్కడ అందరు అందరితో మంచిగా ఉన్నట్లు నటిస్తారు. ముందు పొగుడుతూ.. వెనక గోతులు తీస్తుంటారు. ఇదే నిజం. ప్రస్తుతం బాలీవుడ్లో జరిగేది అదే. నాకు వృత్తి కన్నా వ్యక్తిగత జీవితం ముఖ్యం. అందుకే నా పర్సనల్ విషయాలకు ప్రాధాన్యతనిస్తాను. ఇప్పటికీ నా పేరు ఈ ఇండస్ట్రీలో వినిపిస్తోందంటే అందుకు ప్రధాన కారణం నా స్నేహితులు, తల్లిదండ్రులే. వాస్తవిక దృక్పథం అలవర్చుకోవడం నేర్పించారు. అందుకే నేను ఇంకా నేను ఇక్కడ ఉన్నాను. నా పని నేను చేసుకున్న తర్వాత చిత్రపరిశ్రమకు దూరంగా ఉండడం వల్లే ఇప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను” అంటూ చెప్పుకోచ్చాడు ఇమ్రాన్. ప్రస్తుతం ఇమ్రాన్ ముంబై సాగా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది. జాన్ అబ్రహం, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, మహేష్ ముంజ్రేకర్ కీలక పాత్రల్లో నటించారు.
Also Read: