Biopic On Satyam Ramalinga Raju: ఇటీవల జీవిత కథ ఆధారంగా సినిమాలు తెరకెక్కడం ఒక ట్రెండ్‌లా మారింది. రాజకీయ నాయకుల నుంచి మొదలు సినీ తారల జీవిత కథల ఆధారంగా సినిమాలు వస్తున్నాయి. తాజాగా ఈ వరుసలోకి వెబ్ సిరీస్‌లు కూడా వచ్చి చేరుతున్నాయి.
అయితే విజయాలు సాధించిన వారి జీవిత చరిత్రలనే కాకుండా ఓటమిని చవిచూసిన వారి, స్కామ్‌లకు సంబంధించిన కథాంశంతో కూడా సినిమాలు వస్తున్నాయి. అలాంటి వాటిలో ఇటీవల వచ్చిన ‘స్కామ్ 1992 – ది హర్షద్ మెహతా స్టోరీ’ వెబ్ సిరీస్ ఒకటి. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. షేర్ మార్కెట్లో జరిగిన అతిపెద్ద స్కామ్ కథాంశంతో వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ను ఈ తరం ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున చూడడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా ఇలాంటి మరో సెన్సేషన్ స్టోరీతో మరో వెబ్ సిరీస్ తెరకెక్కనుంది.
అతనే సత్యం రామలింగరాజు… ఒక చిన్న సంస్థగా మొదలు పెట్టిన ‘సత్యం కంప్యూటర్స్’ను ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరింపజేసిన ఘనత ఆయన సొంతం. తెలుగు వారికి ఐటీ సంస్కృతిని పరిచయం చేసి, మధ్య తరగతి ప్రజలకు ఐదెంకల జీతాన్ని పరిచయం చేసిన సత్యం కంప్యూటర్స్ అప్పట్లో ఓ సంచలనం. ఇదిలా ఉంటే తర్వాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో సత్యం రామలింగ రాజు తప్పుడు లెక్కలు చూపించి.. కంపెనీ షేర్ విలువను పెంచి చూపాడన్న ఆరోపణతో అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కథాంశంతోనే ఓ సినిమా రానుంది. కింగ్‌షుక్ నాగ్ అనే రచయిత రాసిన ‘ది డబుల్ లైఫ్ ఆఫ్ రామలింగరాజు’ పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ వెబ్‌సిరీస్‌ను హిందీతో పాటు పలు భాషలో నిర్మించనుంది. ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్‌ను నిర్మించింది కూడా ఇదే సంస్థ కావడం విశేషం. నాగేష్ కుకునూర్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ వెబ్ సిరీస్‌ను ‘సోనీ లివ్’ ఓటీటీ వేదికగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్ విడుదల తర్వాత ఎలాంటి చర్చకు దారి తీస్తుందో చూడాలి.
Applause Entertainment green lights a bilingual business biopic series based on the book “The Double Life of Ramalinga Raju” by Kingshuk Nag. pic.twitter.com/lB3mN04Wuc
— Applause Entertainment (@ApplauseSocial) February 11, 2021
Also Read: Mega Hero Kalyan Dev: ఆశ్యర్యం.. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త చిత్రానికి దర్శకత్వం వహించిందోచ్..