Bigg Boss 5 Telugu: బీఎమ్‌డబ్ల్యూ కొన్న బిగ్‌బాస్‌ కంటెస్టంట్‌.. కల నెరవేరిందంటూ..

|

Nov 26, 2021 | 5:58 PM

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతలా పాపులర్‌ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల ప్రేక్షకులు షోకి ఫిదా అవుతున్నారు. ఇక ఈ రియాలిటీ షో ఓవైపు...

Bigg Boss 5 Telugu: బీఎమ్‌డబ్ల్యూ కొన్న బిగ్‌బాస్‌ కంటెస్టంట్‌.. కల నెరవేరిందంటూ..
Biggboss 5 Telugu
Follow us on

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతలా పాపులర్‌ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల ప్రేక్షకులు షోకి ఫిదా అవుతున్నారు. ఇక ఈ రియాలిటీ షో ఓవైపు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంటే మరోవైపు ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్‌లకు సెలబ్రిటీ హోదాను తెచ్చి పెడుతోంది. కేవలం పాపులారిటే పరిమితం కాకుండా కాసులు కూడా కురిపిస్తోందీ షో. హౌజ్‌లో కొన్ని వారాలు ఉంటే చాలు మినిమం గ్యారెంటీ అన్నట్లు పరిస్థితి మారింది. ఇక ఈ రియాలిటీ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో కంటెస్టెంట్‌లు ఇతర రకాల ఆదాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు చేతులా సంపాదిస్తున్నారు.

ఇక బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్‌ తమ కలలను నెరవేర్చుకుంటున్నారు. ఇప్పటికే కొందరు కంటెస్టెంట్స్‌ సొంతిటిని నిర్మించుకుంటే, మరికొందరు కార్లను కొనుగోలు చేసుకుంటున్నారు. అరియానా, శివజ్యోతి, శ్రీముఖి కొత్త కార్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జాబితాలోకి విశ్వ కూడా వచ్చి చేరాడు. నిజానికి విశ్వ హౌజ్‌లో నుంచి త్వరగానే ఎలిమినేట్‌ అయిన మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు.

ఇదిలా ఉంటే విశ్వ తాజాగా ఖరీదైన కారును కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. రూ. లక్షల్లో విలువ చేసే బీఎండబ్ల్యూ కారును తన సొంతం చేసుకున్న విశ్వ ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తానే స్వయంగా ప్రకటించాడు. కొత్త కారుతో దిగిన ఫోటోను పోస్ట్‌ చేస్తూ.. ‘నా జీవితంలోకి కొత్త ఫ్యామిలీ మెంబర్‌ వచ్చింది. ఇష్టమైన కారును కొంటే ఆ ఆనందమే వేరు. నా కల నెరవేదింది. దీనికి కారణమైన ఆ దేవుడికి, బిగ్‌బాస్‌కు ఇదే నా కృతజ్ఞతలు’ అంటూ క్యాప్షన్‌ జోడించాడు.

Also Read: సింగిల్ సాంగ్‌కు షాకింగ్‌ రెమ్యూనరేషన్ !! అదీ సామ్ లెక్కంటే !! వీడియో

Corona New Variant: కరోనా కొత్త వేరియంట్ ఆనవాళ్ళు మనదేశంలో లేవు.. అయినా జాగ్రత్తలు తప్పనిసరి.. కేంద్ర ప్రభుత్వ సూచనలు!

Corona New Variant: కరోనా కొత్త వేరియంట్ ఆనవాళ్ళు మనదేశంలో లేవు.. అయినా జాగ్రత్తలు తప్పనిసరి.. కేంద్ర ప్రభుత్వ సూచనలు!