Bigg Boss4: ఫైనల్ అయిన కంటెస్టెంట్‌లు.. లిస్ట్‌ ఇదే!

బుల్లితెరపై అతి త్వరలోనే బిగ్‌బాస్ సందడి ప్రారంభం కానుంది. ఇప్పటికే మూడు సీజన్‌లు విజయవంతంగా పూర్తి కాగా.. అంతకుమించిన ఎంటర్‌టైన్‌మెంట్‌తో

Bigg Boss4: ఫైనల్ అయిన కంటెస్టెంట్‌లు.. లిస్ట్‌ ఇదే!

Edited By:

Updated on: Aug 22, 2020 | 8:32 AM

Bigg Boss 4 contestants: బుల్లితెరపై అతి త్వరలోనే బిగ్‌బాస్ సందడి ప్రారంభం కానుంది. ఇప్పటికే మూడు సీజన్‌లు విజయవంతంగా పూర్తి కాగా.. అంతకుమించిన ఎంటర్‌టైన్‌మెంట్‌తో నాలుగో సీజన్‌ ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సీజన్‌కి నాగార్జున మరోసారి వ్యాఖ్యతగా వ్యవహరించబోతుండగా.. ఇందులో ఎవరెవరు పాల్గొనబోతున్నారన్న చర్చ ఫిలింనగర్‌ వర్గాల్లో జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌లు ఖరారు అయ్యారని, కరోనా నేపథ్యంలో వారిని హోం క్వారంటైన్‌లో ఉంచారని తెలుస్తోంది.

ఇక టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న లిస్ట్‌ ప్రకారం ఈ సీజన్‌లో ఎవరెవరు పాల్గొనబోతున్నారంటే.. జబర్దస్త్‌ కెవ్వు కార్తీక్‌, సింగర్ నోయల్‌ సేన్‌, యాంకర్లు లాస్య, అరియానా, నటులు కరాటే కళ్యాణి, సురేఖా వాణి, పూనమ్ బజ్వా, పూజిత పొన్నాడ, యూట్యూబర్లు అలేఖ్య హారిక, మహబూబ్ దిల్‌ సే, గంగవ్వ, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌. మరి ఈ లిస్ట్‌లో నిజమెంత..? ఈ సారి బిగ్‌బాస్‌లో ఎవరెవరు పాల్గొనబోతున్నారు..? తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.

Read More:

బేర్‌గ్రిల్స్‌తో ‘కిలాడీ’ సాహసయాత్ర

తేమ నియంత్రణతో కరోనా వ్యాప్తికి కట్టడి