Bigg Boss 10 Telugu : కెప్టెన్సీ టాస్కులో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్.. రామ్ ప్రసాద్‏ను ఎత్తిపడేసిన రోహిత్.. వంశీ ఆన్ ఫైర్..

బిగ్ బాస్ ఇంట్లో గొడవలు, టాస్కులు, ఫిజికల్ ఫైట్స్ కామన్. ఇక కెప్టెన్సీ టాస్కులో కంటెస్టెంట్స్ చేసే బీభత్సం గురించి తెలిసిందే. ఇక ఈ సీజన్ లోనూ రెండో వారంలో జరుగుతున్న కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఫిజికల్ గా మారిపోయింది. త్రిగుణ్, రోహిత్, రామ్ ప్రసాద్ మధ్య టాస్కు హద్దులు దాటినట్లుగా కనిపిస్తుంది. ఏకంగా రామ్ ప్రసాద్ ను రోహిత్ ఎత్తి అవతల పారేశాడు. మరి సెప్టెంబర్ 16న నాటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందామా.

Bigg Boss 10 Telugu : కెప్టెన్సీ టాస్కులో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్.. రామ్ ప్రసాద్‏ను ఎత్తిపడేసిన రోహిత్.. వంశీ ఆన్ ఫైర్..
Bigg Boss 10 Telugu

Updated on: Sep 17, 2026 | 8:58 AM

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ రెండో వారంలో అడుగుపెట్టడంతోనే ఇంట్లో వేడి వాతావరణం నెలకొంది. సెప్టెంబర్ 16న ప్రసారమైన ఎపిసోడ్‌లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కాస్త తీవ్రమైన ఫిజికల్ ఫైట్‌గా మారింది. పోటీదారులు గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నించడంతో హౌస్‌లో గొడవలు చోటుచేసుకున్నాయి. ముందుగా జరిగిన ‘అనిమల్ పార్క్’ టాస్క్‌లో ఝాన్సీ సరైన సైగలు చేయగా, ముఖేష్ వాటిని గుర్తించి విజయం సాధించాడు. కానీ అమన్, షాలినీ జోడీ తడబడటంతో అమన్‌ను రేసు నుంచి తప్పించారు. ఈ క్రమంలో షాలినీ, అమన్ మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కిచెన్ ఏరియాలో ఫుడ్ విషయంలో ముఖేష్, వర్షిణిలకు, వంశీ, త్రిగుణ్‌లకు మధ్య పెద్ద గొడవే జరిగింది. ముఖ్యంగా ముఖేష్ కాస్త ఎక్కువ రైస్ తిన్నాడనే కారణంతో వంశీ, త్రిగుణ్ రెచ్చిపోయి నోటికి పని చెప్పారు. ఇష్టమొచ్చినట్లుగా ముఖేష్ పై మాటల దాడి చేశాడు. అలాగే నూనె కిందపడి వెస్ట్ అయ్యిందంటూ వంశీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇకపై వంటగది నిబంధనలు కఠినంగా ఉంటాయని హెచ్చరించాడు.

ఎక్కువ మంది చదివినవి : Pragathi : ఆ వాన సాంగ్ వల్ల హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా.. నటి ప్రగతి కామెంట్స్..

ఫిజికల్ టాస్క్: ‘స్నాచ్ ఇట్, ఎయిమ్ ఇట్, థ్రో ఇట్’

రెండో లెవెల్ టాస్క్‌గా బిగ్ బాస్ ‘స్నాచ్ ఇట్, ఎయిమ్ ఇట్, థ్రో ఇట్’ అనే పోటీని నిర్వహించారు. పైనుంచి పడే సంచులలోని బాల్స్‌తో వాల్‌ను కొట్టి డిస్కులను కింద పడేయడమే ఈ ఆట. ఇందులో ఆటలో రాం ప్రసాద్, త్రిగుణ్, రోహిత్, దేబ్జానీలు తీవ్రంగా శ్రమించారు. అయితే ఆట ముందుకు సాగేకొద్దీ రోహిత్ ఫిజికల్ గేమ్‌కు దిగాడు. టాస్కులో ఎవరిని లెక్క చేయకుండా ఫిజికల్ దాడి చేశాడు. ముఖ్యంగా ఆటలో రాం ప్రసాద్‌ను ఏకంగా ఎత్తి అవతల పారేయడం, త్రిగుణ్ మీదికి దూకడం వంటి సంఘటనలు కలకలం రేపాయి. సంచాలక్‌గా వ్యవహరిస్తున్న వంశీని రోహిత్ నిలదీస్తూ, “త్రిగుణ్ నన్ను అడ్డుకుంటుంటే రూల్స్ చెప్పరా?” అని గొడవకు దిగాడు. ఈ క్రమంలో రోహిత్, వంశీలు ఒకరిపైకొకరు దూసుకెళ్లే పరిస్థితి రాగా, తోటి ఇంట్ సభ్యులు వచ్చి వారిని శాంతపరిచారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తొలి సూపర్ స్టార్ కమెడియన్.. ఖరీదైన కారులో ప్రయాణించి.. 44 ఏళ్ళ వయసులోనే రైల్వే స్టేషన్ రోడ్డు మీద అనాథలా..

ఇక మొత్తం గొడవలో గాయపడినా సరే త్రిగుణ్ ఆటను కొనసాగించాడు. చివరకు ఈ లెవెల్‌లో త్రిగుణ్, రాం ప్రసాద్ జోడీ విజయం సాధించింది. అనంతరం రోహిత్‌ను కెప్టెన్సీ రేసు నుంచి పక్కన పెట్టగా, దేబ్జానీకి ఛాన్స్ లభించింది. ఎపిసోడ్ ముగిసే సమయానికి ముఖేష్, ఝాన్సీ, షాలినీ, రాం ప్రసాద్, త్రిగుణ్, దేబ్జానీలు కెప్టెన్సీ పోటీలో నిలిచారు.

ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao : నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది.. తెలుగు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.. రాఘవేంద్రరావు..

 

Loading...
Unable to load recommendations.
Follow Us