
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 వీకెండ్ ఎపిసోడ్ ఆడియన్స్‌కు విపరీతమైన థ్రిల్‌ను అందిస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో 3 సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో మరో ఎలిమినేషన్ ఉంటుందని ట్విస్ట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. ఇప్పటికే తొలివారంలోనే హౌస్‌లో మిడ్-వీక్ ఎలిమినేషన్ పేరుతో ఇద్దరు కంటెస్టెంట్లను పంపించేయడం సంచలనంగా మారింది. మూడో రోజున చరణ్, అలాగే నాలుగో రోజున చైత్రా రాయ్‌లను ఇంటి సభ్యుల ఓటింగ్ ప్రకారమే ఎలిమినేట్ చేశారనే వార్తలు బయటకు వచ్చాయి. ఆడియన్స్ ఓటింగ్‌తో సంబంధం లేకుండా కేవలం కంటెస్టెంట్స్ ఇచ్చిన నిర్ణయంతోనే వీళ్ళను పంపేయడంపై నెటిజన్ల నుండి విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే చరణ్, చైత్రల మిడ్-వీక్ ఎలిమినేషన్ల వెనుక బిగ్ బాస్ ఏదైనా పెద్ద ట్విస్ట్ ప్లాన్ చేసి ఉంటాడని, వీకెండ్‌లో నాగార్జున వీరిద్దరినీ మళ్లీ హౌస్‌లోకి తీసుకువచ్చే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : బాబోయ్.. నెట్టింట గత్తరలేపుతున్న దండుపాళ్యం బ్యూటీ.. ఆమె ఇన్ స్టా చూస్తే..
ఇక ఈ ఆదివారం మరో ఎలిమినేషన్ ఉంటుందని ప్రోమోతోనే ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. తాజాగా విడుదలైన ప్రోమోలో.. డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ సుధీర్, వర్షిణి , కృష్ణుడులను స్టేజ్ పై ఉన్న మూడు విభిన్నమైన ఎరుపు రంగు తలపుల నముందు నిలబెట్టారు. ఈ ముగ్గురిలో ఎవరు హౌస్‌మేట్స్‌గా సేవ్ అవుతారు, ఎవరు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారో తేల్చేందుకు నాగార్జున ఒక ట్విస్ట్ ఇచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Serial Song : పేరుకే సీరియల్ సాంగ్.. కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసిన పాట ఇది.. ఇప్పటికీ యూట్యూబ్‌లో తగ్గని డిమాండ్..
స్టేజ్ వెనుక ఉన్న మూడు డోర్లలో ఒకరి డోర్ వెనుక మాత్రమే ‘ఎలిమినేషన్’ సిద్ధంగా ఉందని, మిగిలిన డోర్స్ సేఫ్ జోన్‌ను సూచిస్తాయని నాగార్జున వెల్లడించారు. నాగార్జున కౌంట్‌డౌన్ ఇస్తూ సుధీర్, వర్షిణి, కృష్ణులను ఒకేసారి తమ డోర్లను తెరిచి చూడాలని ఆదేశించారు. ఈ క్రమంలో ముగ్గురు కంటెస్టెంట్స్ ఎంతో భయంగా, ఉత్కంఠగా తమ వెనుకున్న తలుపులు తెరవడానికి వెళ్లగా, హౌస్‌లోని మిగిలిన సభ్యులు సైతం ఎవరికి ఏమవుతుందో అని అత్యంత ఉత్కంఠతో వేచి చూస్తూ కనిపించారు. తలుపులు తెరిచిన అనంతరం నాగార్జున తీవ్ర నిరాశతో “ఐ యామ్ సారీ” అని చెప్పడంతో ప్రోమో పూర్తయింది. అయితే తాజా సమాచారం ప్రకారం తొలివారం ఓటింగ్ ఆధారంగా నటుడు కృష్ణుడు ఎలిమినేట్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ల కథ సీక్రెట్ రూమ్ లేదా ఏదైనా టాస్క్‌తో ముడిపడి ఉంటే, తొలివారంలో బిగ్ బాస్ హౌస్ నుండి వీడ్కోలు చెప్పేది ఒక్క కృష్ణుడు మాత్రమే అవుతాడు. దానికి సంబంధించి వీకెండ్ ఎపిసోడ్‌లో స్పష్టత రానుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood: సినిమా మొత్తం హీరో ఒకే రంగు షర్ట్ లో ఉంటాడు.. హిట్టు కాదన్నారు.. థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి..
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా తర్వాత హీరోయిన్‌కు వెండి పళ్లెంలో పట్టు బట్టలు ఇచ్చాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..