AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu : రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? నెటిజన్స్ రియాక్షన్ ఇదే..

బిగ్ బాస్ సీజన్ 10 అప్పుడే రెండు వారాలు గడిచిపోయాయి. ఇప్పటికే హౌస్ నుంచి ముగ్గురు ఎలిమినేట్ కాగా.. చరణ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు రెండో వారంలో కృష్ణుడు హౌస్ నుంచి బయటకు వచ్చారు. అయితే ఆయనకు రెండు వారాలకు ఎంత పారితోషికం దక్కిందనే న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Bigg Boss 10 Telugu : రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
Krishnudu
Rajitha Chanti
|

Updated on: Sep 21, 2026 | 1:04 PM

Share

బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10’ రెండో వారంలోకి అడుగుపెట్టి రసవత్తరంగా సాగుతోంది. కామనర్లతో పాటు సీరియల్, సినీ ప్రముఖులు పోటీపడుతున్న ఈ సీజన్‌లో రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి అయింది. ఊహించని విధంగా నటుడు కృష్ణుడు అతి తక్కువ ఓటింగ్ కారణంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశారు. అయితే, హౌస్‌లో ఉన్న రెండు వారాలకు గాను ఆయన అందుకున్న పారితోషికం (రెమ్యూనరేషన్) ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి కృష్ణుడు పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమైంది. టాస్కుల్లో చురుగ్గా పాల్గొనకపోవడం, ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే ఎక్కువగా సైలెంట్‌గా ఉంటూ ఆడియన్ తరహాలో చూస్తూ ఉండటం ఆయనకు పెద్ద మైనస్‌గా మారింది. వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కూడా కృష్ణుడి ఆటతీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీవీకే పరిమితమవుతున్నారని ఫైర్ అవుతూ ప్రతీకాత్మకంగా టీవీని కూడా పగలగొట్టారు. నామినేషన్‌లో సుధీర్, సృష్టి, కృష్ణుడు చివరి స్థానాల్లో ఉండగా, అతి తక్కువ ఓట్లు నమోదు కావడంతో కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు.

సినిమాల్లో మంచి గుర్తింపు ఉన్న నటుడు కావడంతో కృష్ణుడికి బిగ్‌బాస్ నిర్వాహకులు భారీగానే ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఫిలింనగర్ సమాచారం ప్రకారం కృష్ణుడికి వారానికి రూ. 3 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఒప్పందం కుదిరిందట. ఆ లెక్కన దాదాపు రెండు వారాల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగిన కృష్ణుడికి రెండు వారాలకు గాను రూ. 6 లక్షలు (రూ. 5 నుంచి 6 లక్షలు) లభించినట్లు అంచనా. పెద్దగా టాస్కులు ఆడకుండా, పెద్దగా సందడి చేయకుండానే రెండు వారాల్లో ఇంట్లో కూర్చొని ఆరు లక్షలు సంపాదించడం కృష్ణుడికే చెల్లిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తనలోని మరో కోణాన్ని చూపించి బిగ్‌బాస్‌తో మంచి కంబ్యాక్ ఇవ్వాలని భావించిన కృష్ణుడి జర్నీ ఆశించిన స్థాయిలో సాగకపోయినా, ఈ షో ద్వారా మంచి జ్ఞాపకాలను , భారీ పారితోషికాన్ని పొంది ఆయన బయటకు వచ్చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

Follow Us
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!
పాతబస్తీలో రూ.10 చిల్లర కోసం దారుణం.. ఆటో డ్రైవర్‌ హత్య..
పాతబస్తీలో రూ.10 చిల్లర కోసం దారుణం.. ఆటో డ్రైవర్‌ హత్య..