Bidisha De majumdar: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం..

తన అపార్ట్మెంట్‏లో గురువారం ఉదయం బిదిషా శవమై కనిపించింది. గత నాలుగేళ్లుగా అదే అపార్ట్మెంట్ లో నివసిస్తున్న బిదిషా.. మే 25న ఉరి వేసుకుని కనిపించింది.

Bidisha De majumdar: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం..
Bidisha

Updated on: May 26, 2022 | 1:39 PM

సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ బెంగాల్ నటి పల్లవి డే మరణవార్త మరవక ముందే.. బెంగాలీ నటి బిదిషా డి మజుందార్ (Bidisha) ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. కోల్‏కత్తలోని తన అపార్ట్మెంట్‏లో గురువారం ఉదయం బిదిషా శవమై కనిపించింది. గత నాలుగేళ్లుగా అదే అపార్ట్మెంట్ లో నివసిస్తున్న బిదిషా.. మే 25న ఉరి వేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించగా.. బిదిషా ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆర్జీకర్ ఆసుపత్రికి పంపించారు. బిదిషా ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైందని .. తన కుటుంబం, సన్నిహితుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ప్రాథమిక విచారణలో ఆమె ఆత్యహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బిదిషా మరణవార్తతో బెంగాల్ సినీ ఇండస్ట్రీలో షాకయ్యింది.

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన బిదిషా.. 2021లో భార్ ది క్లౌన్ అనే షార్ట్ ఫిల్మ్ చేసి గుర్తింపు పొందింది. బిదిషా మరణవార్త తెలుసుకున్న సన్నిహితులు, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. సినీ ఇండస్ట్రీలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల బెంగాల్ నటి పల్లవి డే కూడా కోల్ కత్తాలోని గార్ఫాలోని తన ప్లాట్ లో శవమై కనిపించిన సంగతి తెలిసిందే. తన నివాసంలో ఉరివేసుకుని పల్లవి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.. ఆమె అమీ సిరాజేర్ బేగం, రేషమ్ ఝాపి, కుంజోచయా, మోన్ మనే నాతో అనే పలు షోలలో నటించింది.