Raima Islam Shimu: గోనే సంచిలో నటి మృతదేహం.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..

ప్రముఖ ఫేమస్ నటి గోనే సంచిలో శవమై తేలిన ఘటన ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. కొద్ది రోజుల క్రితం కనిపించకుండాపోయిన

Raima Islam Shimu: గోనే సంచిలో నటి మృతదేహం.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..
Raima

Updated on: Jan 19, 2022 | 2:24 PM

ప్రముఖ ఫేమస్ నటి గోనే సంచిలో శవమై తేలిన ఘటన ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. కొద్ది రోజుల క్రితం కనిపించకుండాపోయిన బంగ్లాదేశ్ నటి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. బంగ్లాదేశ్‏కు చెందిన నటి రైమా ఇస్లాం షిము ఓ బ్రిడ్జి పక్కన గోనే సంచిలో శవంగా కనిపించింది. దీంతో పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‏కు చెందిన నటి రైమా ఇస్లాం షిము 1998లో బర్తమాన్ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. సుమారు 25 చిత్రాల్లో నటించిన ఆమె.. పలు బుల్లితెర పై పలు టీవీ సీరియళ్లలో నటించడమే కాకుండా.. వాటిని నిర్మించింది.

ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం నటి రైమా కనిపించకుండా పోయింది. దీంతో తన భార్య కనిపించడం లేదంటూ ఆమె భర్త షెకావత్ అలీ నోబెల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు జనవరి 16న మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. కాగా దేశ రాజధాని ఢాకాలోని కెరానిగంజ్ లో బ్రిడ్జి వద్ద ఒక గోనే సంచి కనిపించడంతో అనుమానంతో అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించిన పోలీసులు ఆ బ్యాగులో ఉన్నది నటి రైమా మృతదేహంగా గుర్తించారు. ఆమె శరీరంపై గాయాలు కనిపించడంతో అనుమానం వచ్చి ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్యలో ప్రమేయం ఉన్నట్లు తెలీంది. రైమా హత్యకు కుటుంబకలహాలే కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రైమా భర్తతోపాటు.. అతని స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Ram Gopal Varma: మనసులో మాట చెప్పిన రామ్ గోపాల్ వర్మ.. బాలయ్య ఒప్పుకుంటారా?

Venkatesh: బాలకృష్ణ బాటలోనే వెంకటేష్.. రియాలిటీ షోకు హోస్ట్‏గా చేయనున్న వెంకీ ?

Ram Gopal Varma: మనసులో మాట చెప్పిన రామ్ గోపాల్ వర్మ.. బాలయ్య ఒప్పుకుంటారా?

Krithi Shetty: ఆ స్టార్ హీరో రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించుకున్న కృతి శెట్టి.. అతను ఎవరంటే..