ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, బోయపాటి డెరెక్షన్స్ రూపొందుతున్న సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ మూవీని మే 28న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. ఇందులో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా చేస్తూనే.. బాలయ్య మరో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అటు ఈ సినిమాతో పాటు క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభంకానున్నట్లుగా తెలుస్తోంది. తర్వలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లుగా సమాచారం.
Also Read:
సూపర్ ఛాన్స్ కొట్టేసిన ఈషారెబ్బా.. భారీ ప్రాజెక్టులో కీలక పాత్రలో నటించనున్న తెలుగమ్మాయి..
రూటు మార్చిన ప్రభాస్ హీరోయిన్.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ వైపు అడుగులు వేస్తున్న స్వీటీ..