AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

13ఏళ్ల క్రితం నాటి ఫ్లాప్‌.. ఇప్పటికీ అప్పులు కడుతోన్న బాలయ్య నిర్మాత

బాలయ్య నటించిన చిత్రాల్లో మహారథి ఒకటి. వాసు తెరకెక్కించిన ఈ చిత్రంలో స్నేహ, మీరా జాస్మిన్ హీరోయిన్లుగా నటించగా

13ఏళ్ల క్రితం నాటి ఫ్లాప్‌.. ఇప్పటికీ అప్పులు కడుతోన్న బాలయ్య నిర్మాత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 26, 2020 | 11:17 AM

Share

Balayya Maharathi movie: బాలయ్య నటించిన చిత్రాల్లో మహారథి ఒకటి. వాసు తెరకెక్కించిన ఈ చిత్రంలో స్నేహ, మీరా జాస్మిన్ హీరోయిన్లుగా నటించగా.. జయప్రద విలన్‌గా కనిపించారు. శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్ బ్యానర్ కింద వాకాడ అప్పారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2007లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో పెద్ద పరాజయం పాలైంది. కాగా ఈ చిత్రం విడుదలై 13 ఏళ్లు పూర్తైనా.. ఆ మూవీ కోసం తీసుకున్న అప్పులను ఇప్పటికీ కడుతున్నారట అప్పారావు. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

”మహారథి సినిమాను ప్రారంభించినప్పుడు కొంతమంది ఫైనాన్సియర్లు ముందుకు వచ్చారు. అయితే ఆ తరువాత మళ్లీ వెనక్కి వెళ్లారు. దీంతో షాక్‌కి గురైన నేను.. నిధులను సమకూర్చుకొనే పనిలో పడ్డాను. అందుకే స్క్రిప్ట్‌ మీద ఫోకస్ చేయలేకపోయా. ఆ తరువాత బ్యాంక్ నుంచి 4 కోట్లు రుణంగా ఇప్పించి నా స్నేహితుడు ఒకరు సహాయం చేశారు. కానీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో చాలా నష్టాలను చవిచూశాను. ఇప్పటికీ ఫైనాన్సియర్లకు నేను అప్పులను కడుతున్నాను” అని వెల్లడించారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: దేశవ్యాప్తంగా 85,362 కొత్త కేసులు

IPL 2020: కోహ్లీకి 12 లక్షల జరిమానా.. ఎందుకంటే..!