‘ఎన్‌ఆర్‌ఐ’గా రాబోతున్న అవసరాల

|

Feb 20, 2019 | 6:17 PM

హైదరాబాద్: అవసరాల శ్రీనివాస్‌.. నటుడిగా, దర్శకుడిగా, హీరోగానూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న నాయనా రారా ఇంటికి (ఎన్‌ఆర్‌ఐ) చిత్ర షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. అక్కినేని అమల క్లాప్‌ కొట్టి మూవీ షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీ, మహతి కథానాయికలుగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు నాని, అక్కినేని అఖిల్‌, సిరివెన్నెల సీతారామశాస్త్రిలాంటి ప్రముఖులు హాజరయ్యారు. పూర్తి హాస్యభరితంగా తెరకెక్కుతున్న ఈ […]

‘ఎన్‌ఆర్‌ఐ’గా రాబోతున్న అవసరాల
Follow us on

హైదరాబాద్:
అవసరాల శ్రీనివాస్‌.. నటుడిగా, దర్శకుడిగా, హీరోగానూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న నాయనా రారా ఇంటికి (ఎన్‌ఆర్‌ఐ) చిత్ర షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు.

అక్కినేని అమల క్లాప్‌ కొట్టి మూవీ షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీ, మహతి కథానాయికలుగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు నాని, అక్కినేని అఖిల్‌, సిరివెన్నెల సీతారామశాస్త్రిలాంటి ప్రముఖులు హాజరయ్యారు. పూర్తి హాస్యభరితంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగబాబు ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.