AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashu Reddy: అషు రెడ్డి కేసులో మరో ట్విస్ట్.. బిగ్ బాస్ బ్యూటీపై మరో సెక్షన్.. అడ్డంగా ఇరికించిన ఆడియో కాల్..

మనీ ట్రాప్.. దానికి మ్యారేజ్ ముసుగు.. ఈ ఆరోపణలపై ఆషురెడ్డి ఆడియో బయటికొచ్చింది. డబ్బులిస్తాను.. బట్ కండీషన్స్ అప్లయ్ అంటూ బాధితుడు ధర్మేంద్రకు ఇచ్చిపడేసింది. చెప్పింది వింటే సరి.. కాదూ కూడదని వేషాలేస్తే హెరాస్‌మెంట్‌ అస్త్రంతో కొడతానని వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ అషురెడ్డి ధైర్యమేంటి? తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా మడతపేచీలు పెట్టడమేంటన్న చర్చ నెట్టింట రచ్చ చేస్తోంది.

Ashu Reddy: అషు రెడ్డి కేసులో మరో ట్విస్ట్.. బిగ్ బాస్ బ్యూటీపై మరో సెక్షన్.. అడ్డంగా ఇరికించిన ఆడియో కాల్..
Ashu Reddy
Shaik Madar Saheb
|

Updated on: Apr 29, 2026 | 11:12 AM

Share

మనీ ట్రాప్.. దానికి మ్యారేజ్ ముసుగు.. ఈ ఆరోపణలపై ఆషురెడ్డి ఆడియో బయటికొచ్చింది. డబ్బులిస్తాను.. బట్ కండీషన్స్ అప్లయ్ అంటూ బాధితుడు ధర్మేంద్రకు ఇచ్చిపడేసింది. చెప్పింది వింటే సరి.. కాదూ కూడదని వేషాలేస్తే హెరాస్‌మెంట్‌ అస్త్రంతో కొడతానని వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ అషురెడ్డి ధైర్యమేంటి? తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా మడతపేచీలు పెట్టడమేంటన్న చర్చ నెట్టింట రచ్చ చేస్తోంది. మొత్తానికి అషురెడ్డి వివాదం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి పేరుతో పోయాం మోసం అంటూ ధర్మేంద్ర పరివారం ఠాణా మెట్లెక్కింది. అంతేకాదూ.. ఆధారాలివిగో అంటూ పోలీసులకు అందించింది. ఇంత జరుగుతుంటే.. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ.. అషురెడ్డి తెలంగాణ కోర్డును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే.. అషురెడ్డి ఎపిసోడ్‌లో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ధర్మేంద్రకు ఆఫర్ ఆడియో కూడా పంపించింది. సెటిల్‌మెంట్‌ కోసం వెంకట్‌కు కొన్ని ప్రపోజల్స్ పంపింది..

ధర్మేంద్రకు మేలో రూ.1.5 కోట్లు ఇస్తానన్న అషురెడ్డి.. మిగతా డబ్బులు సంపాదించాక ఇస్తానంటూ మెలిక పెట్టింది. మాట వినకుంటే వేధింపుల కేసు పెడతానని వార్నింగ్‌ కూడా ఇచ్చింది. ప్రవీణ, వేణుస్వామి డబ్బు సెటిల్‌ చేస్తారని..చెప్పుకొచ్చింది. అయితే.. అందులో ఆమె బెదిరిస్తూ మాట్లాడటం.. ఇప్పుడు సంచలంగా మారింది. ఆడియో రికార్డింగ్ అషురెడ్డిని మరింత ఇరికించినట్లయింది..

అషురెడ్డిపై మరో సెక్షన్..

కాగా.. సినీనటి అషురెడ్డి కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. మూడ్రోజుల్లో బాధితుడు ధర్మేంద్ర లండన్ నుంచి హైదరాబాద్‌ రానున్నాడు. మరోవైపు, అషురెడ్డి లేటెస్ట్‌ ఆడియోపై పోలీసుల ఫోకస్ పెట్టారు. బెదిరింపులకు పాల్పడినందున అషురెడ్డిపై మరో సెక్షన్‌ యాడ్‌ చేశారు. ధర్మేంద్ర తండ్రి.. ఇవాళ పోలీసుల ముందుకు వెళ్లనున్నారు. అషురెడ్డి ఎపిసోడ్‌లో ధర్మేంద్ర తండ్రి నుంచి వివరాలు సేకరించనున్నారు పోలీసులు.. ఆ తర్వాత.. ధర్మేంద్ర.. అషురెడ్డి విచారణ కొనసాగుతుందని పేర్కొంటున్నారు.

అషురెడ్డి ఆడియో వైరల్..

రూ. 9.5 కోట్లు తీసుకుని మోసం చేసిందంటూ ఆధారాలు చూపిస్తున్న ధర్మేంద్ర 8ఏళ్లుగా అషురెడ్డి తెలుసంటూ పేర్కొంటున్నాడు.. మూడేళ్లుగా పెళ్లి పేరుతో చాలా ఖర్చుపెట్టించిందని.. అషురెడ్డిని డబ్బు అడిగితే..ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని పేర్కొంటున్నాడు.

ఇలా అషురెడ్డిపై వివాదాలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ బోల్డ్ సీన్స్, బోల్డ్ ఇంటర్వ్యూస్, బోల్డ్ ఫోటోషూట్స్‌పై నెట్టింట ఎన్నో విమర్శలొచ్చాయి. ముఖ్యంగా బిగ్‌బాస్‌ ఇంటికి వెళ్లొచ్చాక, రాంగోపాల్‌ వర్మతో స్పైసీ ఇంటర్వ్యూ ఆమె కెరీర్‌ను మరో టర్న్‌తీసుకునేలా చేసింది.

మొత్తానికి అషురెడ్డి ధర్మేంద్ర కేసులో కోట్ల రూపాయల బురిడీ నిజమేనా? జస్ట్.. అవి ఆరోపణలు మాత్రమేనా? అనేది తేల్చేయాలని డిసైడ్ అయ్యారు పోలీసులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?
తులసి మాల ఎప్పుడు ధరించాలి? శుభ ఫలితాల కోసం ఈ నియమాలు పాటించండి
తులసి మాల ఎప్పుడు ధరించాలి? శుభ ఫలితాల కోసం ఈ నియమాలు పాటించండి
పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం..
పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం..
మహాత్మా గాంధీ టెన్త్ క్లాస్ మార్కులు ఎన్నో తెలుసా? మార్క్ షీట్
మహాత్మా గాంధీ టెన్త్ క్లాస్ మార్కులు ఎన్నో తెలుసా? మార్క్ షీట్
ఊరొళ్లొచ్చాక ఫ్రిజ్‌లోని ఆహారం తినవచ్చా లేదా? ఈ ఒక్క చెంచా టెస్ట
ఊరొళ్లొచ్చాక ఫ్రిజ్‌లోని ఆహారం తినవచ్చా లేదా? ఈ ఒక్క చెంచా టెస్ట
ఎండలో ఉంచిన పుచ్చకాయలను తింటున్నారా? అయితే నరకానికి టికెట్ తీసుక
ఎండలో ఉంచిన పుచ్చకాయలను తింటున్నారా? అయితే నరకానికి టికెట్ తీసుక
ముక్కు పగిలి రక్తం కారుతుంటే.. వీడెవడండీ ఇంతలా నవ్వుతున్నాడు
ముక్కు పగిలి రక్తం కారుతుంటే.. వీడెవడండీ ఇంతలా నవ్వుతున్నాడు
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంతకు తెగించావ్‌రా.. పాపం ఆ సాఫ్ట్‌వేర్..
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంతకు తెగించావ్‌రా.. పాపం ఆ సాఫ్ట్‌వేర్..
గేమింగ్ యాప్ వేదికగా ‘లవ్ జిహాద్’ వల!
గేమింగ్ యాప్ వేదికగా ‘లవ్ జిహాద్’ వల!
ఉడిపి స్టైల్ కొబ్బరి–కొత్తిమీర చట్నీ.. ఇలా చేసి తిన్నారంటే..
ఉడిపి స్టైల్ కొబ్బరి–కొత్తిమీర చట్నీ.. ఇలా చేసి తిన్నారంటే..