నిత్య, రీతూల ‘నిన్నిలా నిన్నిలా’.. ఆకట్టుకుంటోన్న పోస్టర్‌

టాలెంటెడ్ బ్యూటీలు నిత్యా మీనన్‌, రీతూ వర్మ, కోలీవుడ్ ప్రముఖ నటుడు అశోక్ సెల్వన్ ప్రధాన పాత్రల్లో అని ఐవీ శశి తెరకెక్కిస్తోన్న చిత్రం 'నిన్నిలా నిన్నిలా'

నిత్య, రీతూల నిన్నిలా నిన్నిలా.. ఆకట్టుకుంటోన్న పోస్టర్‌

Updated on: Oct 19, 2020 | 3:28 PM

Ninnila Ninnila First Look: టాలెంటెడ్ బ్యూటీలు నిత్యా మీనన్‌, రీతూ వర్మ, కోలీవుడ్ ప్రముఖ నటుడు అశోక్ సెల్వన్ ప్రధాన పాత్రల్లో అని ఐవీ శశి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ ఇవాళ విడుదల అయ్యింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నటుడు అశోక్ సెల్వన్ ట్వీట్ పెడుతూ.. ఇది నా మొదటి తెలుగు సినిమా. అద్భుతమైన నటీనటులు ఇందులో భాగం అయ్యారు అని కామెంట్ పెట్టారు.

కాగా ఈ పోస్టర్‌ చాలా ఆసక్తిగా ఉండగా.. వంట గదిలో ఉండే సామాన్లు అందులో ఉన్నాయి. ఇక నిత్యా, రీతూ, అశోక్‌ల తలలు ప్లేట్‌లలో ఉండగా.. పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. కథానుగుణంగా ఈ మూవీ షూటింగ్ లండన్ తదితర ప్రాంతాల్లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీని ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించడం విశేషం.

Read More:

జవాన్ మృతదేహం పంపేందుకు ‘నో’ చెప్పిన అధికారులు

‘మహా సముద్రం’లో చేరిన అను ఇమ్మాన్యుల్‌

Loading...
Unable to load recommendations.
Follow Us