తెలుగులో హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాని గతంలో స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే అనుకోని విధంగా కొన్ని రోజుల షూటింగ్ తర్వాత నిర్మాత, దర్శకుల మధ్య ఇబ్బందులు తలెత్తడంతో సినిమాని మధ్యలో ఆపేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మరో కొత్త దర్శకుడికి బాధ్యతలను అప్పగించి 50 రోజులలోనే షూటింగ్ పూర్తి చేసిన విషయం తెలిసిందే.
ఇక అంతా బాగుంది అనుకున్న తరుణంలో తమిళ ‘అర్జున్ రెడ్డి’ సినిమా మరోసారి చిక్కుల్లో పడింది. తన వెర్షన్ లో తీసిన సీన్స్ ను ఉపయోగించకూడదంటూ తమిళ ‘అర్జున్ రెడ్డి’ సినిమా నిర్మాతలకు నోటీసులు పంపించాడు. అయితే దీనిపై ఆ చిత్ర నిర్మాతలు స్పందించాల్సి ఉంది. మరోవైపు ‘ఆదిత్య వర్మ’ పేరుతో రూపొందుతున్న ఈ రీమేక్ జూలైలో విడుదలకు సన్నద్ధం అవుతోంది.