Arjun Kapoor Corona: బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ గత నెలలో కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. నెల రోజుల తరువాత అర్జున్ ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని నటుడు సోషల్ మీడియాలో వెల్లడించారు. తాను కరోనాను జయించానని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని, షూటింగ్‌లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. అంతేకాదు ఈ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులకు సూచించారు.
నాకు కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ వైరస్ నుంచి పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నా. తిరిగి షూటింగ్‌లో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నా. నేను బావుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ వైరస్ ప్రాణాంతకమైనది. దీన్ని సీరియస్‌గా తీసుకోండి. కరోనా వైరస్ వయసు భేదం లేకుండా ప్రతి ఒక్కరికి సోకుతుంది. అందుకే ఎల్లప్పుడూ మాస్క్ ధరించండి. బీఎంసీకి థ్యాంక్యు. ఈ సమయంలో మా కోసం మీ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సెల్యూట్. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అని ట్వీట్ చేశారు. కాగా తనకు కరోనా సోకినట్లు గత నెల 6న అర్జున్ కపూర్ సోషల్ మీడియాలో వెల్లడించిన విషయం తెలిసిందే. అర్జున్‌తో పాటు మలైకాకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వగా.. ఇటీవలే ఆమె ఈ వైరస్‌ని జయించారు.
Read More:
జగనన్న విద్యాకానుక ద్వారా 42.43 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
రూ.1.1కోట్లు కట్టండి.. ఆ ఛానెల్‌కి ‘నిశ్శబ్దం’ టీమ్ నోటీసులు