Mahesh Babu movie: మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే చిత్రంలో నటించనున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కథానుగుణంగా అమెరికా నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుండగా.. త్వరలో టీమ్ అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ మూవీలో మహేష్‌కి విలన్‌గా కోలీవుడ్ స్టార్ హీరో అరవింద్ స్వామి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరవింద్ స్వామి డేట్లను ఇచ్చేశారని టాక్. అలాగే మహేష్ సోదరి పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఒకవేళ ఇవే నిజమైతే సినిమాకు వీరిద్దరు అస్సెట్‌గా మారనున్నారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందించనున్నారు.
Read More:
ప్రభాస్ ‘రాధే శ్యామ్’.. పూజా రోల్‌పై ఇంట్రస్టింగ్ అప్‌డేట్
ఒక్క రూపాయికే బైక్ బుక్ చేసుకునే అవకాశం.. వివరాలివే