Upasana: అరుదైన గౌరవాన్ని అందుకున్న ఉపాసన.. నాట్‌ హెల్త్‌ సీఎస్‌ఆర్‌ అవార్డుకు ఎంపిక..

|

Mar 30, 2022 | 4:20 PM

Upasana: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) భార్యగా, అపోలో హాస్పిటల్‌ వ్యవస్థాపకులు ప్రతాప్‌ సి. రెడ్డి మనవరాలిగా పేరున్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలని ఆలోచనతో ఉంటారు ఉపాసన. ఇంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా తనదైన ముద్ర వేయాలని..

Upasana: అరుదైన గౌరవాన్ని అందుకున్న ఉపాసన.. నాట్‌ హెల్త్‌ సీఎస్‌ఆర్‌ అవార్డుకు ఎంపిక..
Upasana
Follow us on

Upasana: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) భార్యగా, అపోలో హాస్పిటల్‌ వ్యవస్థాపకులు ప్రతాప్‌ సి. రెడ్డి మనవరాలిగా పేరున్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలని ఆలోచనతో ఉంటారు ఉపాసన. ఇంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా తనదైన ముద్ర వేయాలని భావించే ఉపాసన అపోలో ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అపోలో లైఫ్‌కి వైస్ చైర్‌ పర్సన్‌గా, బీ పాజిటివ్‌ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా విధులు నిర్వరిస్తున్నారు ఉపాసన. ఈ క్రమంలోనే ఉపాసన చేస్తున్న పనులను గుర్తిస్తూ పలు సంస్థలు అవార్డులు ఇస్తూ వస్తున్నాయి.

సపూర్ణ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఉపాసన అపోలో ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన రూపొందించిన ఓ ప్రాజెక్టుకు అరుదైన అవార్డు దక్కింది. 2022 ఏడాదికి గాను నాట్‌ హెల్త్‌ సీఎస్‌ఆర్‌ అవార్డు దక్కింది. ఇటీవల ఈ అవార్డును అందుకున్న ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. తాము చేస్తున్న పనులకు గాను లభించిన ఈ గుర్తింపుతో తాత ప్ర‌తాప్ సి.రెడ్డి చెప్పే సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే దిశ‌గా ప‌య‌నిస్తున్నామ‌న్న భావ‌న క‌లుగుతోంద‌ని ఉపాస‌న చెప్పుకొచ్చారు.

Also Read: Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. మరింత ఆలస్యం కానున్న సలార్‌ విడుదల.. కారణం ఇదేనా.?

Tribal Reservations: గిరిజన రిజర్వేషన్ల పేరుతో మరోసారి మోసానికి ప్రయత్నిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ః మంత్రి సత్యవతి రాథోడ్

IRCTC: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకునే బంపర్ ఆఫర్..