Nishabdham trailer: అంచనాలు పెంచేసిన ‘నిశ్శబ్దం’ ట్రైలర్

అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ధ్రిల్లర్ కథా చిత్రం నిశ్శబ్దం. గాంధీ జయంతి సందర్భంగా

Nishabdham trailer: అంచనాలు పెంచేసిన నిశ్శబ్దం ట్రైలర్

Updated on: Sep 21, 2020 | 1:43 PM

Nishabdham trailer released: అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ధ్రిల్లర్ కథా చిత్రం నిశ్శబ్దం. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఆద్యంతం థ్రిల్లర్‌, హారర్‌తో తెరకెక్కిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలను పెంచేసింది. గిరీష్‌ గోపాలకృష్ణన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ ట్రైలర్‌కి మరో అస్సెట్‌గా నిలిచింది. ఇక ట్రైలర్‌లో కాస్త కామెడీ టచ్‌ని కూడా చూపించారు దర్శకుడు. సినిమా కథను పెద్దగా రివీల్ చేయకపోవడంతో ఈ మూవీలో ఏదో మ్యాజిక్ ఉన్నట్లు అర్థమవుతోంది.

ఇక ఈ మూవీలో అనుష్క మూగ ఆర్టిస్ట్‌గా నటించగా.. మాధవన్ గిటారిస్ట్‌గా కనిపించనున్నారు. అంజలి, శాలిని పాండే, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించిన ఈ మూవీకి కోన వెంకట్ స్క్రీన్‌ప్లే అందించారు. టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూఛిబొట్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మామూలుగా ఏప్రిల్‌లో ఈ మూవీ విడుదల కావాల్సిన ఉండగా.. లాక్‌డౌన్ రావడంతో వాయిదా పడింది. ఇక ఇప్పుడు పలు చిత్రాలు ఓటీటీ బాట పట్టగా.. అదే బాటలో నిశ్శబ్దం కూడా నడిచింది. తెలుగులో వి తరువాత ఓటీటీలో విడుదల కాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం నిశ్శబ్దం కావడం విశేషం.

Read more:

కరోనా కాలం.. ఏపీలో పెరిగిన గుడ్డు ధరలు

ప్రభాస్‌ ‘ఆదిపురుష్’‌.. లక్ష్మణుడిగా దక్షిణాది యంగ్ హీరో..!

Loading...
Unable to load recommendations.
Follow Us