Anupama Parameswaran: అందాల రాశి అనుపమ పరమేశ్వరన్ పుట్టిన రోజు నేడు.. శుభాకాంక్షలు వెల్లువ
అనుపమ పేరులో ఉంది ఓ వైబ్రేషన్.. అందం అభినయంతో సినీ ప్రేక్షకుల మనసు దోచుకున్న అందాల రాశి. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో అడుగు పెడితే..టాలీవుడ్ లో..
Anupama Parameswaran : అనుపమ పేరులో ఉంది ఓ వైబ్రేషన్.. అందం అభినయంతో సినీ ప్రేక్షకుల మనసు దోచుకున్న అందాల రాశి. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో అడుగు పెడితే..టాలీవుడ్ లో అడుగు పెట్టిన మొదటి సినిమాలో రావణాసుడి వాళ్ళావిడ కూడా వాళ్ళాయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంది ఈ ఒక్క డైలాగ్ తో కుర్రకారుని స్పెల్ బౌల్డ్ చేసింది కేరళ కుట్టి.
కేరళలోని త్రిసూర్ జిల్లా ఇరంజలకుడలో పుట్టిన అనుపమ పరమేశ్వరన్ ఈరోజు తన 25వ పుట్టిన రోజును జరుపుకుంటుంది. పరమేశ్వరన్, సునీత దంపతులకు 1996 ఫిబ్రవరి 18న జన్మించింది. ఆమెకు అక్షయ్ పరమేశ్వరన్ అనే సోదరుడు ఉన్నాడు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన అనుపమ డిగ్రీ అభ్యసిస్తున్న సమయంలో సినిమా అవకాశం వచ్చింది. సినిమాలు చేస్తూనే డిగ్రీని దూరవిద్య ద్వారా పూర్తి చేసింది. తెలుగు, తమిళ మలయాళంలో మంచి మంచి పాత్రలతో అతి తక్కువ సమయంన్లో భారీ ఫాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.
ప్రేమమ్, అఆ ,శతమానం భవతి వంటి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అనుపమ ప్రస్తుతం నిఖిల్ కు జోడీగా 18 పేజీస్‌లో నటిస్తోంది.తమిళంలో ఆమె నటించిన రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్నాయి.
అందరికీ నటిగానే సుపరిచితురాలైన అనుపమ ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది. ఓటీటీలో విడుదలైన మనియారయిలే అశోకన్‌లో నటించడంతోపాటు సహాయ దర్శకురాలిగా మెప్పించింది. ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న అనుపమకు పలువురు సినీ తారలు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెష్ వెల్లువ కురిపించారు.
Also Read: