Sarkaru vaari paata : మహేశ్ అభిమానులకు గుడ్ న్యూస్.. సర్కారువారి పాట సర్‌ప్రైజ్ గిఫ్ట్ అప్పుడేనట..

Sarkaru vaari paata : ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్

Sarkaru vaari paata : మహేశ్ అభిమానులకు గుడ్ న్యూస్.. సర్కారువారి పాట సర్‌ప్రైజ్ గిఫ్ట్ అప్పుడేనట..
sarkaru vaari paata
Follow us
uppula Raju

|

Updated on: Feb 18, 2021 | 2:21 PM

Sarkaru vaari paata : ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం అంతే సాలిడ్ గా తెరకెక్కుతుంది కూడా.. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాత్రం మహేష్ ఫ్యాన్స్ కు సూపర్ కిక్ ఇస్తూనే ఉన్నాడు.

ఇది వరకు వీరిద్దరి నుంచి వచ్చిన ఆడియో ఆల్బమ్స్ కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో ఈ చిత్రంపై కూడా అంతే స్థాయి అంచనాలు నెలకొన్నాయి. మరి అందుకు తగ్గట్టుగా థమన్ కూడా వర్క్ చేస్తున్నాని చెప్తున్నాడు. అయితే మరి ఈ సినిమా ఫస్ట్ సింగిలో మరే ఇతర సాలిడ్ ఆడియో అప్డేట్ మాత్రం వచ్చే ఆగస్ట్ లోనే ఉంటుంది అని కన్ఫర్మ్ చేసేసాడు థమన్. అప్పుడు ఎలాగో మహేష్ బర్త్ డే ఉంది కాబట్టి అప్పటికి ప్లాన్ చేసి ఉండొచ్చు. మరి ఆ అప్డేట్ ఏంటి అన్నది తెలియాలి అంటే అప్పటి వరకు ఆగక తప్పదు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేశ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

వరుణ్ తేజ సినిమా కోసం హైదరాబాద్ వచ్చిన కన్నడ సూపర్ స్టార్.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా..