Vishnu Priya: ఇన్ స్టాలో సబ్‌స్క్రిప్షన్ అందుకోసమే పెట్టాను.. అసలు విషయం చెప్పిన విష్ణు ప్రియ..
బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇటీవల ఇన్ స్టా సబ్ స్క్రిప్షన్ వివాదంతో ఒక్కసారిగా వార్తలలో నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ , సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆదాయంపై కీలక విషయాలు వెల్లడించారు. నటీనటులు టీవీతో పోలిస్తే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ సంపాదిస్తారని ఆమె తెలిపారు. గత అనుభవాలన్నీ తనను తీర్చిదిద్దాయని, భవిష్యత్తుకు మార్గదర్శకత్వం కోరుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు.

తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటి విష్ణు ప్రియ, ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్, సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆదాయం , తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె రంభ ఊర్వశి మేనక చిత్ర బృందంతో కలిసి ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తన గురించి సాధారణంగా ప్రచారంలో ఉన్న “షోల కన్నా, మూవీస్ కన్నా కూడా విష్ణు ప్రియ సోషల్ మీడియా ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది” అనే వ్యాఖ్యపై ఆమె స్పందించారు. ఇది కేవలం తన ఒక్కదానికే కాదని, సోషల్ మీడియా ద్వారానే చాలా మంది సెలబ్రిటీలు టీవీ లేదా సినిమా ద్వారా వచ్చే దానికంటే ఎక్కువ సంపాదిస్తున్నారని ఆమె కుండబద్దలు కొట్టారు. బ్రాండ్‌లు, ప్రమోషన్ల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా ఉంటుందని, టీవీలో రెండు ఎపిసోడ్‌లకు వచ్చే ఆదాయం కన్నా సోషల్ మీడియాలో ఒక్క ప్రాజెక్ట్ ద్వారా ఎక్కువ లభిస్తుందని ఆమె వివరించారు. టీవీలో పడే కష్టానికి, సోషల్ మీడియాలో లభించే పర్క్‌లకు తేడా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. చాలా మందికి టాలెంట్ ఉన్నా అవకాశాలు లభించడం లేదని, కానీ తన ఫోన్ మాత్రం ప్రతిరోజూ అవకాశాలతో మోగుతుందని, ఇది తన అదృష్టమని పేర్కొన్నారు.
వ్యక్తిగత విషయాల గురించి అడగ్గా, తన జీవితంలో గతంలో జరిగిన సంఘటనలను మార్చాల్సిన అవసరం లేదని విష్ణు ప్రియ దృఢంగా చెప్పారు. “నాకు జరిగిన ప్రతిదీ, మంచి అనుభవాలు, చెడు అనుభవాలు అన్నీ కలిపి నేను ఈరోజు ఉన్న వ్యక్తిని చేశాయి. అవి నాకు మరింత జ్ఞానం, సహనం, దయను అందించాయి” అని ఆమె పేర్కొన్నారు. గత అనుభవాలను మార్చడానికి తాను ఇష్టపడనని, కానీ భవిష్యత్తులో మాత్రం సరైన మార్గదర్శకత్వం కోరుకుంటున్నానని, మంచిని ఎంచుకోవడానికి, మంచి చేయడానికీ గైడెన్స్ కావాలని ఆమె అన్నారు. ముఖ్యంగా తన తల్లి మరణం తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని, ఆ ఒక్క విషయాన్ని మార్చగలగలిగితే బాగుంటుందని భావిస్తున్నానని, ఆ తర్వాత దేవుడి ఇష్టమని ఆమె తెలిపారు.
తాను చిన్నతనం నుంచీ అల్ప సంతోషిని అని, మ్యాథ్స్ రాదని, ఎంతో సోమరినని, డీమోటివేటెడ్‌గా ఉండేదాననని విష్ణు ప్రియ వెల్లడించారు. తన కుటుంబం తాను ఏమైనా సాధిస్తుందని అస్సలు అనుకోలేదని తెలిపారు. అయినప్పటికీ, తాను ఏదో ఒకటి సాధించానని, పరిశ్రమలో 11-12 సంవత్సరాల తర్వాత కూడా అవకాశాలు లభిస్తున్నందుకు చాలా కృతజ్ఞతతో ఉన్నానని అన్నారు. తనకు ఒక్క కంప్లైంట్ కూడా లేదని, మంచి బాయ్‌ఫ్రెండ్ తప్ప అని సరదాగా వ్యాఖ్యానించారు. జాతకాన్ని తాను చాలా సీరియస్‌గా నమ్ముతానని, తనకు బాయ్‌ఫ్రెండ్ లేడని, కనీసం భర్త కూడా లేడని నవ్వుతూ చెప్పారు. తన అభిమానులు తన కోసం పూజలు చేస్తే ఒక మంచి అబ్బాయి లభిస్తాడని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాను ‘ఊర్వశి’ పాత్రలో ఉన్నానని, చాలా ప్రశాంతంగా, శాంతియుతంగా ఉండాలనుకుంటున్నానని విష్ణు ప్రియ చెప్పుకొచ్చారు.
ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..
