Anchor Machiraju Pradeep: రేడియో జాకీగా కెరీర్ మొదలు పెట్టిన యాంకర్ ప్రదీప్ ఇప్పుడు నెల సంపాదన ఎంతో తెలుసా..!

| Edited By: Ravi Kiran

Feb 05, 2021 | 5:02 PM

ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కృషి పట్టుదల ఉంటె మనిషి ఉన్నత స్థానానికి వెళ్ళగలరు అనడానికి ఒక ఉదాహరణ. ఒకానొక సమయంలో  రోజుకి వంద రూపాయల కోసం కూడా కష్టపడ్డానని ప్రదీప్ ఒక ఇంటర్వ్యూలో..

Anchor Machiraju Pradeep: రేడియో జాకీగా కెరీర్ మొదలు పెట్టిన యాంకర్ ప్రదీప్ ఇప్పుడు నెల సంపాదన ఎంతో తెలుసా..!
Follow us on

Anchor Machiraju Pradeep: ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కృషి పట్టుదల ఉంటె మనిషి ఉన్నత స్థానానికి వెళ్ళగలరు అనడానికి ఒక ఉదాహరణ. ఒకానొక సమయంలో  రోజుకి వంద రూపాయల కోసం కూడా కష్టపడ్డానని ప్రదీప్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.. అలంటి ప్రదీప్ కు రేడియో జాకీగా అవకాశం లభించింది. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తనని తానూ ఆవిష్కరించుకున్నాడు. ఈరోజు రోజుకి లక్షలు సంపాదించే స్టేజ్ కు చేరుకున్నాడు.

అవును బుల్లి తేర ప్రేక్షకులకు ప్రదీప్ మాచిరాజు పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లి తెరపై అత్తా కోడళ్ళు షో తో అడుగు పెట్టి ఇప్పుడు పలు చానల్స్ లో అనేక షోలకు హోస్ట్ గా చేస్తున్నాడు. స్టార్ యాంకర్ గా ఓ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక షోలతో పాటు రియాలిటీ షోలు సినిమా ఇంటర్వ్యూలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రదీప్ టాప్ మేల్ యాంకర్ అంతేకాదు అప్పుడప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తుండే ప్రదీప్.. తాజాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో వెండి తెరపై హీరోగా అడుగు పెట్టాడు. ఓ వైపు టీవీ షోలతో, మరో వైపు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ప్రదీప్‌.. నెలకు ఎంత సంపాదిస్తున్నాడు అన్న ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అయితే తాజాగా సమాచారం ప్రకారం.. ప్రదీప్ నెలకు దాదాపు రూ. 40 నుంచి 50 లక్షల వరకు సంపాదిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. రెండేళ్ల క్రితం ప్రదీప్ టీవీ షోలలో ఒక్కో ఎపిసోడ్‌కురూ 75 వేల వరకు తీసుకునేవాడట.. అయితే ఇప్పుడు అదే షోకు ప్రదీప్ అక్షరాలా లక్షన్నరకు పైగా తీసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతుంది. ఇక ఇటీవల [ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రానికి పాతిక లక్షల వరకు తీసుకున్నాడట. కరోనా సమయంలో రిలీజైన ఈ సినిమా అంచనాలకు మించి లాభాలను ఆర్జించింది అని ఫిల్మ్ నగర్ లో టాక్.. దీంతో ప్రదీప్ రెండో సినిమాకు రెడీ అవుతున్నాడట.. షోలు, నిర్మాత, రియాల్టీ షో లతో బిజీ మరోవైపు సినిమా షూటింగ్స్ ఇన్ని రకాలుగా నెల మొత్తం షూటింగ్స్ బిజీగానే ఉండే ప్రదీప్ కు అరకోటి ఆదాయం రావడం కామన్ అని అంటున్నారు.

Also Read:

అర్ధ సెంచరీ చేసిన సిబ్లి.. సూపర్ ఫామ్‌లో రూట్..

హీరోగా మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ప్రదీప్ మాచిరాజు..