Anchor Pradeep Movie Update: బుల్లి తెరపై యాంకర్ గా సుమ తర్వాత ఓ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఓ వైపు బుల్లి తెరపై యాంకర్ గా ప్రోగ్రామ్స్ చేస్తూనే మరోవైపు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సెలబ్రెటీలతో ఇంటర్వ్యూలు చేస్తూ.. టీవీ షోలో తనకంటూ ఓ ఫేమ్ తెచ్చుకున్నాడు. వెండి తెరపై చిన్న చిన్న పాత్రలు ధరిస్తూ సందడి చేసిన ప్రదీప్ తాజాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సినిమా రిలీజ్ సమయంలో ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రదీప్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కదా ఇక బుల్లి తెరపై యాంకర్ గా అవకాశాలను తగ్గించుకుంటాడా అన్న ప్రేక్షకుల సందేహాలకు తనదైన రీతిలో సమాధానం చెప్పాడు ప్రదీప్. బుల్లితెరా? వెండితెరా? అనే విషయంపై స్పందిస్తూ.. నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఈడా ఉంటా అని.. అవకాశాలు ఎక్కడ వస్తే అక్కడ చేస్తుంటానని చెప్పాడు.. తన అంతిమ లక్ష్యం.. ఎక్కడైనా ప్రేక్షకులను అలరించడమే అని అన్నాడు. హీరోగా రెండో సినిమా అనేది త్వరలోనే అప్డేట్ ఇస్తానని చెప్పాడు ప్రదీప్. అంతేకాదు.. ఇటీవలే ఓ కథ విన్నానని .. తన రెండో సినిమా గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తానని చెప్పాడు.
Also Read: ప్రపంచదేశాలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చే కెపాసిటీ భారత్ కు మాత్రమే ఉంది… అదే పెద్ద ఆస్తి ఐక్యరాజ్యసమితి