Anasuya In Sunil’s Next : సునీల్ కు జోడీగా ‘జబర్దస్త్’ యాంకర్.. ‘వేదాంతం రాఘ‌వ‌య్య’లో హీరోయిన్ గా..

కమెడియన్ గా  మంచి గుర్తిపు తెచ్చుకున్న నటుడు సునీల్ ఆతర్వాత హీరో గా మారి ఆకట్టుకున్నాడు.ఆతర్వాత హీరోగా పలు సినిమాలు..

Anasuya In Sunils Next : సునీల్ కు జోడీగా జబర్దస్త్ యాంకర్.. వేదాంతం రాఘ‌వ‌య్యలో హీరోయిన్ గా..

Updated on: Jan 11, 2021 | 3:16 PM

Anasuya In Sunil’s Next :కమెడియన్ గా మంచి గుర్తిపు తెచ్చుకున్న నటుడు సునీల్ ఆతర్వాత హీరో గా మారి ఆకట్టుకున్నాడు. ఆతర్వాత హీరోగా పలు సినిమాలు చేసిన ఆతర్వాత సక్సెస్ సాధించలేక పోయాడు. హీరోగా, కమెడియన్ గా చేస్తూ వస్తున్న సునీల్ ఇప్పుడు నెగిటివ్ పాత్రల్లో కూడా మెప్పిస్తున్నాడు. రవితేజ నటించిన డిస్కోరాజా సినిమాతో విలన్ గా మారిన సునీల్ ఆతర్వాత ఇటీవల విడుదలైన కలర్ ఫోటో సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు .

తాజాగాసునీల్ హీరోగా మరో సినిమా తెరకెక్కబోతుంది. ‘వేదాంతం రాఘ‌వ‌య్య’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ లాంఛింగ్ కార్య‌క్ర‌మం ఆదివారం హైదరాబాద్ జ‌రిగింది. హ‌రీశ్ శంక‌ర్ ఈ చిత్రానికి క‌థనందిస్తుండగా..14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ స‌మ‌ర్పిస్తోంది. ఇక ఈ సినిమాలో యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తుందని ఫిలిం నగర్లో  వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే దర్శకుడు సీ చంద్ర‌మోహ‌న్ అన‌సూయ‌కు కథను వినిపించారని అంటున్నారు. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించాలని భావిస్తున్నారట చిత్రయూనిట్. మరి ఈవార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Acharya Movie: మెగాస్టార్‌ చిరంజీవి మూవీ ‘ఆచార్య’ విడుదల తేదీ ఫిక్స్‌ చేశారా.? ఆ తేదీ చిరుకు కలిసి వచ్చేనా…?

Janhvi Kapoors : లేడీ సూపర్ స్టార్‌ నయనతార క్యారెక్టర్ చేయనున్న జాన్వీ కపూర్.. మిడిల్ క్లాస్ అమ్మాయిగా..