మర్యాద రామన్న‌లోని ‘తెలుగమ్మాయి’ పాట రాయడానికి చాలా కష్టపడ్డా… సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్…

| Edited By:

Dec 14, 2020 | 3:32 PM

సినిమా పాట రాయాలంటే కథకు, సన్నివేశానికి తగినట్లుగా రాయాలి. రైటర్స్‌కు దర్శక నిర్మాతలు ఓ సందర్భాన్ని చెప్పి దానికి అనుగుణంగానే పాట రాయాలని అంటారు.

మర్యాద రామన్న‌లోని ‘తెలుగమ్మాయి’ పాట రాయడానికి చాలా కష్టపడ్డా... సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్...
Follow us on

సినిమా పాట రాయాలంటే కథకు, సన్నివేశానికి తగినట్లుగా రాయాలి. రైటర్స్‌కు దర్శక నిర్మాతలు ఓ సందర్భాన్ని చెప్పి దానికి అనుగుణంగానే పాట రాయాలని అంటారు. అయితే ఓ పాట గంటలో పూర్తయితే… కొన్ని పాటలు రోజుల తరబడి సమయం తీసుకుంటాయి. తనకు ఎదురైన అలాంటి ఓ సందర్భాన్ని అనంత శ్రీరామ్ తాజాగా చెప్పుకొచ్చారు. సునీల్‌, సలోని జంటగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద రామన్న’ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 

ఈ సినిమాలో హీరోయిన్ సలోని తాను వివాహం చేసుకునే వ్యక్తి ఎలా ఉండాలో ఊహించుకుని బొమ్మలు గీస్తుంటుంది. వాటిని చూసిన కుటుంబ సభ్యులు పిచ్చి గీతలు అంటూ ఏడిపిస్తుంటారు. ఆ బొమ్మల్లో ఏదో విషయం ఉందని హీరో సునీల్ ఆ కుటుంబ సభ్యులను ఇంప్రెస్‌ చేసేలా రాయాల్సిన గీతమిది. చాలా క్లిష్టమైన సన్నివేశం కావడంతో ఆ పాట రాయడానికి అనంత శ్రీరామ్‌కు ఏకంగా 43 రోజులు పట్టిందట. కీరవాణి, గీతా మాధురి ఆలపించిన ఈ పాట అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాట రచయితగా అనంత శ్రీరామ్‌కు ఎంతో పేరు తెచ్చిపెట్టింది కూడా.