పెళ్లి వార్తలు.. కొరటాలకు ఫోన్ చేసిన కాజల్‌!

| Edited By:

Aug 25, 2020 | 8:18 AM

టాలీవుడ్ చందమామ కాజల్ ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని ఇటీవల పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. గౌతమ్ అనే వ్యక్తితో కాజల్ నిశ్చితార్థం అయ్యిందని

పెళ్లి వార్తలు.. కొరటాలకు ఫోన్ చేసిన కాజల్‌!
Follow us on

Kajal Marriage News: టాలీవుడ్ చందమామ కాజల్ ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని ఇటీవల పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. గౌతమ్ అనే వ్యక్తితో కాజల్ నిశ్చితార్థం అయ్యిందని.. ఈ విషయాన్ని ఇరు కుటుంబాలు చాలా గోప్యంగా ఉంచాయని తెలుస్తోంది. అంతేకాదు ఈ ఎంగేజ్‌మెంట్‌కి టాలీవుడ్ నుంచి యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా హాజరు అయ్యారని టాక్ నడిచింది. ఇక ఈ వార్తలన్నింటికి ఆజ్యం పోస్తూ ఇప్పుడు మరో వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటోన్న కాజల్‌.. భారీ బడ్జెట్ చిత్రాలను త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలో కొరటాల శివకు ఫోన్ చేసిన కాజల్‌.. చిరంజీవి ‘ఆచార్య’లో తన సన్నివేశాలను త్వరగా తెరకెక్కించాలని కోరిందట. ఈ మేరకు కొరటాల కూడా షూటింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కాజల్‌పైన సన్నివేశాలను ఆయన మొదట తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆచార్యతో పాటు కమల్‌ హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న ఇండియన్ 2లోనూ కాజల్ నటిస్తోంది. లాక్‌డౌన్‌కి ముందు జరిగిన ఈ మూవీ షూటింగ్‌లో సైతం ఆమె పాల్గొంది. మరి ఆ సినిమా పరిస్థితి ఏంటి..? కొరటాల లాగే శంకర్‌కి కాజల్‌ ఫోన్ చేయనుందా..? నిజంగానే చందమామ ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందా..? వంటి ప్రశ్నలపై కాజల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read More:

డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి పదవీకాలం పొడిగింపు

బయోమెట్రిక్ హాజరు ద్వారానే వేతనాలు.. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు