Alludu Adhurs Song: పిల్లడు.. అదుర్స్.. సాంగ్ అదిరిపోయింది.. జానీ మాస్టర్ స్టెప్పులు, దేవిశ్రీ మ్యూజిక్‌తో..

|

Jan 10, 2021 | 12:08 PM

Alludu Adhurs Song: బెల్లంకొండ శ్రీనివాస్, నభానటేశ్ హీరో, హీరోయిన్లుగా నటించిన అల్లుడు అదుర్స్ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ప్రేక్షకులకు

Alludu Adhurs Song: పిల్లడు.. అదుర్స్.. సాంగ్ అదిరిపోయింది.. జానీ మాస్టర్ స్టెప్పులు, దేవిశ్రీ మ్యూజిక్‌తో..
Follow us on

Alludu Adhurs Song: బెల్లంకొండ శ్రీనివాస్, నభానటేశ్ హీరో, హీరోయిన్లుగా నటించిన అల్లుడు అదుర్స్ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి సిద్ధమవుతోంది. షూటింగ్ ఆలస్యం కారణంగా ఈ చిత్రం అనుకున్న టైమ్ కు విడుదల కాలేకపోతుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని దర్శక నిర్మాతలు కచ్చితంగా చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అల్లుడు.. అదుర్స్ అనే వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

యూట్యూబ్‌లో ఈ సాంగ్ అదరగొడుతుంది. మంచి బీట్‌తో దుమ్ము ధుళిపేస్తోంది. జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేస్తున్న స్టెప్స్‌ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపేలా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ గీతాన్ని రామజోగయ్యశాస్త్రి రచించగా, జస్ప్రిత్‌జాజ్‌, వైష్ణవి ఆలపించారు. సంతోష్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌‌ నిర్మిస్తోంది. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. సినిమా ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే మరి.

Alludu Adhurs Movie: అల్లుడు అదుర్స్ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందంటారా? కారణాలు ఇలా ఉన్నాయి..

Alludu Adhurs : ఒక్క రోజు ముందే ప్రేక్షకుల ముందుకు రానున్న బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’..?